Hyderabadలో కారు బీభత్సం

ABN , First Publish Date - 2022-05-14T17:54:43+05:30 IST

నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు... మరో కారు, ద్విచక్ర వాహాన్ని ఢీకొట్టింది.

Hyderabadలో కారు బీభత్సం

హైదరాబాద్‌: నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు... మరో కారు, ద్విచక్ర వాహాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వస్తున్న వృద్దుడు, మరో మహిళకు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్రేక్‌పై కాలు వేయబోయి, టెన్షన్‌లో ఎక్స్‌లెటర్ మీద కాలు వేశానని డ్రైవర్ చెపుతున్నాడు.  మరోవైపు కారు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more