హుస్నాబాద్‌ మార్కెట్‌ యార్డు భేష్‌

ABN , First Publish Date - 2022-05-07T05:36:15+05:30 IST

హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధికి కేరా్‌ఫగా నిలుస్తున్నది. మార్కెట్‌కు ఏటా రూ. 5 కోట్ల నిధులతో జిల్లాలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నది. హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో హుస్నాబాద్‌, చిగురుమామిడి, అక్కన్నపేట మండలాలు ఉన్నాయి. 1991 సంవత్సరంలో 13 ఎకరాల్లో మార్కెట్‌ను ప్రారంభించారు. గతంలో గ్రేడ్‌-3 మార్కెట్‌గా ఉండగా..

హుస్నాబాద్‌ మార్కెట్‌ యార్డు భేష్‌

అన్ని హంగులతో అభివృద్ధి

ప్రతీ సంవత్సరం రూ. 5 కోట్ల వరకు ఆదాయం

రూ. 3 కోట్లతో రైతుబజార్‌ నిర్మాణానికి టెండర్లు

నిర్మాణం పూర్తయిన నూతన కార్యాలయ భవనం


హుస్నాబాద్‌, మే 6 : హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధికి కేరా్‌ఫగా నిలుస్తున్నది. మార్కెట్‌కు ఏటా రూ. 5 కోట్ల నిధులతో జిల్లాలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నది. హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో హుస్నాబాద్‌, చిగురుమామిడి, అక్కన్నపేట మండలాలు ఉన్నాయి. 1991 సంవత్సరంలో 13 ఎకరాల్లో మార్కెట్‌ను ప్రారంభించారు. గతంలో గ్రేడ్‌-3 మార్కెట్‌గా ఉండగా.. ప్రస్తుతం గ్రేడ్‌-2గా ఎదిగింది. ఆదాయం దృష్ట్యా గ్రేడ్‌-1 హోదా రావాల్సి ఉన్నా ఆలస్యమవుతున్నది. మార్కెట్‌ యార్డులో నిర్మించిన గోదాములు, దుకాణాల కిరాయి ద్వారా రూ. 18 లక్షల ఆదాయం వస్తున్నది. గత సంవత్సరం నుంచి మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ, సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలకు ప్యాడీక్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు సమకూర్చుతున్నారు. ఈ సంవత్సరం మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేశారు.


రూ. 4.40 కోట్ల ఆదాయమే లక్ష్యం

ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4.40 కోట్ల ఆదాయ సముపార్జనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మార్కెట్‌ అధికారులు తెలియజేశారు. ప్రభుత్వం నుంచి రూ. 1.33 కోట్లు, ప్రైవేట్‌ కొనుగోళ్ల ద్వారా రూ. 3.10 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 26.17 లక్షల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 5 కోట్ల నిధులున్నాయి. వ్యవసాయ మార్కెట్‌ ద్వారా రూ. 5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. రూ. 93 లక్షలతో నిర్మించిన నూతన కార్యాలయ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. మార్కెట్‌యార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ, గేట్లు, టాయ్‌లెట్లు, కవర్‌షెడ్డు పనులు జరుగుతున్నాయి. పట్టణంలోని చావడి వద్ద నూతన రైతుబజార్‌ నిర్మాణానికి టెండర్‌ ఖరారయినట్లు అధికారులు తెలిపారు. 


రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం : కాసర్ల అశోక్‌బాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, హుస్నాబాద్‌

వ్యవసాయ మార్కెట్‌ ద్వారా రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యమిస్తున్నాం. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. మామిడి రైతుల సౌకర్యం కోసం ప్రైవేటు వ్యక్తులతో యార్డులోని గోదాంలోనే కొనుగోళ్లు చేయిస్తున్నాం. మార్కెట్‌కు గ్రేడ్‌-1 హోదా త్వరలోనే సాధిస్తాం.

Read more