Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త జంట పైశాచికత్వం..! శుభమా అంటూ పెళ్లి చేసుకుని..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లంటే ఆకాశమంత పందిరి..భూదేవి అంత అరుగు..ఇదంతా పాతకాలం ఫ్యాషన్! ఇప్పుడు యువత కొత్త దనం కోరుకుంటుంది. అందుకే కొందరు హాట్ ఎయిర్ బెల్లూన్లలో ఆకాశంలో ఎగురుతూ పెళ్లి చేసుకుంటుంటే..మరొకరు నీటి అడుగున ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. అంతేకాకుండా.. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లు, పెళ్లిళ్లలో దిగే ఫోటోల్లోనూ  కొత్తదనం కోసం ట్రై చేస్తున్నారు.. దీనిపై ఎవరికీ ఎటువంటి అభ్యతరమూ ఉండక్కర్లేదు. కానీ ఓ పాకీస్థాన్ జంట మాత్రం ఈ శుభసందర్భంలో ఓ దారుణానికి పాల్పడింది. తమ పెళ్లి ఫొటోలు ప్రత్యేకంగా ఉండాలనే తాపత్రయంలో పడి ఓ మూగజీవాన్ని వేధించింది. ఓ సింహం కూనకు మత్తుముందు ఇచ్చి, ఆ తరువాత దాన్ని పక్కనపెట్టుకుని ఆ దంపతులు ఫోటోలను ఫోజులిచ్చారు. 

పూర్తిగా స్పృహలో లేక, చుట్టు జరుగుతున్నది గమనిస్తూ ఏం చేయలేని స్థితిలో కూరుకుపోయిన సింహం కూన అక్కడి హడావుడికి నరకం అనుభవించింది. అయితే..ఇవేమీ పట్టని ఆ జంట..తెగ సంబరపడిపోతూ ఫోటోలు దిగి నెట్టింట్లో పెట్టడం, అది వైరల్ అయి నెటిజన్లు భగ్గమనడం జరిగిపోయింది. అయితే..పెళ్లి ఫోటోల్లో కొత్తదనం కోరుకునే జంటల కోసం లాహోర్‌లోని ఓ స్టూడియో ఇటువంటి ఏర్పాట్లు చేసిందట. ఇటువంటి వారికోసమే ఆ స్టూడియో సింహాన్ని పెంచుతోందట. ఈ విషయాలన్ని తెలిసి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ స్టూడియోపైనే కాకుండా ఇటువంటి ఆలోచన చేసిన జంటను కూడా కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement