సులభంగా జీర్ణమై పొట్ట తేలికగా ఉండాలంటే..

ABN , First Publish Date - 2022-05-11T17:47:46+05:30 IST

భోజనాల మధ్య స్నాక్స్‌ ఆరగించడం పరిపాటిగా మారింది. అయితే ఆకలిని అదుపులో ఉంచడంతో పాటు, ఆరోగ్యానికీ తోడ్పడే పదార్థాలనే స్నాక్స్‌గా ఎంచుకోవాలి.

సులభంగా జీర్ణమై పొట్ట తేలికగా ఉండాలంటే..

ఆంధ్రజ్యోతి(11-05-2022)

భోజనాల మధ్య స్నాక్స్‌ ఆరగించడం పరిపాటిగా మారింది. అయితే ఆకలిని అదుపులో ఉంచడంతో పాటు, ఆరోగ్యానికీ తోడ్పడే పదార్థాలనే స్నాక్స్‌గా ఎంచుకోవాలి. 


ఉదయం అల్పాహారానికీ మధ్యాహ్న భోజనానికీ మధ్య, మధ్యాహ్న భోజనానికీ రాత్రి భోజనానికీ మధ్య, ఏదో ఒక పండు తినాలి. పండ్లలోని మెగ్నీషియం తిన్న ఆహారం శక్తిగా మారడానికి తోడ్పడుతుంది. పండ్లకు బదులుగా సమోసా, కచోరీల్లాంటివి తినడం వల్ల వాటిలో ఎక్కువ మోతాదుల్లో ఉండే పిండిపదార్థాలు, కొవ్వులు పలు ఆరోగ్య సమస్యలకు మూలమవుతాయి. ఆమ్లాన్ని అమితంగా ఉత్పన్నం చేసే ఈ ఆహార పదార్థాలు ఆకలి తీరుస్తూనే ఆరోగ్యపరంగా తీవ్రమైన హానిని చేస్తాయి. 


కాబట్టి పండ్లు లేదా మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. సలాడ్స్‌ కూడా తీసుకోవచ్చు. నైట్‌ షిప్ట్‌ చేసే ఉద్యోగులు, సులభంగా జీర్ణమై, వేగంగా  శక్తినిచ్చే పప్పు, అన్నంతో కూడిన సాధారణ భోజనం చేయడమే ఉత్తమం. లేదంటే పొట్టు తీయని పెసర్ల లాంటి గింజలతో చేసిన ‘కిచ్‌డీ’ తీసుకోవచ్చు. వీటిల్లో బాగా ఫైబర్‌ ఉంటుంది కాబట్టి,  సులభంగా జీర్ణమవుతుంది. పొట్ట తేలికగా ఉంటుంది. నిద్ర ముంచుకు రాకుండా కూడా ఉంటుంది. 

Read more