రూ.4.5 లక్షలు పలికిన 9999

ABN , First Publish Date - 2022-05-14T12:51:09+05:30 IST

ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాటలో ఆర్టీఏకు రూ. 33.58లక్షలు

రూ.4.5 లక్షలు పలికిన 9999

  • ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాటలో ఆర్టీఏకు రూ. 33.58లక్షలు


హైదరాబాద్‌ సిటీ : ఖైరతాబాద్‌ రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఆల్‌ నైన్స్‌ (TS09-FV 9999) నెంబర్‌కు భారీ ధర పలికింది. రూ.4,49,999 (నాలుగున్నర లక్షలు) చెల్లించి వాహనదారుడు రాజశేఖర్‌రెడ్డి ఆ నంబర్‌ను సొంతం చేసుకున్నారు. TS09-FW 0001 నెంబర్‌ను శ్రీనిధి ఎస్టేట్స్‌ సంస్థ రూ.4 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. శుక్రవారం జరిగిన బిడ్డింగ్‌లో మొత్తం రూ.33.58 లక్షల ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖాధికారులు వెల్లడించారు.

Read more