AP గురుకులాల్లో Fifth class ప్రవేశాలు

ABN , First Publish Date - 2022-05-13T20:49:08+05:30 IST

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ(Andhra Pradesh Institute of Gurukul Schools) - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి ప్రవేశాల(Fifth class admissions)కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని 36 సాధారణ, 12 మైనారిటీ...

AP గురుకులాల్లో Fifth class ప్రవేశాలు

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ(Andhra Pradesh Institute of Gurukul Schools) - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి ప్రవేశాల(Fifth class admissions)కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని 36 సాధారణ, 12 మైనారిటీ గురుకులాలతోపాటు 2 రీజనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (ఆర్‌సీఈ) - తాడికొండ, కొడిగెనహళ్లి బాలుర పాఠశాలల్లో అడ్మిషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆటొమేటెడ్‌ ర్యాండమ్‌ సెలెక్షన్‌ (లాటరీ పద్ధతి) ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. పాత జిల్లాల ప్రకారం పాఠశాలలు కేటాయిస్తారు. ఆంగ్లమాధ్యమం(English medium)లో బోధన ఉంటుంది.


అర్హత: జనరల్‌, బీసీ కేటగిరీలకు చెందిన బాల బాలికలు 2011 సెప్టెంబరు 1 నుంచి 2013 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2009 సెప్టెంబరు 1 నుంచి 2013 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. సొంత జిల్లాలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన గ్రామీణ పాఠశాలల్లో మూడు, నాలుగు తరగతులు చదివి ఉండాలి. రిజర్వుడు వర్గాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదివినా అప్లయ్‌ చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000లకు మించకూడదు. లేదా తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు. 

ప్రవేశాలు: సాధారణ గురుకుల పాఠశాలల్లో జిల్లాలవారీగా స్థానిక విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. మైనారిటీ పాఠశాలల్లో మాత్రం నిబంధనల ప్రకారం ఇతర జిల్లాల విద్యార్థులకు కూడా అడ్మిషన్‌లు ఇస్తారు. ఆర్‌సీఈల్లో నిర్దేశించిన జిల్లాల విద్యార్థులకు రిజర్వేషన్‌ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు. తాడికొండ పాఠశాలకు ఎనిమిది కోస్తా జిల్లాలవారు (నెల్లూరు మినహా); కొడిగెనహళ్లి పాఠశాలకు నెల్లూరు సహా నాలుగు రాయలసీమ జిల్లాల విద్యార్థులు అర్హులు. 


సాధారణ గురుకులాల్లో అన్ని కేటగిరీల విద్యార్థులకూ అవకాశం కల్పిస్తారు. మైనారిటీ గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్‌ ఇస్తారు. కడప జిల్లా వేంపల్లి పాఠశాలలో ముస్లిం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్‌ ఇస్తారు.

సీట్లు: ప్రతి గురుకుల పాఠశాలలో 80 సీట్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని పీలేరు పాఠశాల, కర్నూలు మైనారిటీ బాలుర పాఠశాలల్లో ఒక్కోదానిలో 40 సీట్లు మాత్రమే ఉన్నాయి. 


దరఖాస్తు ఫీజు: రూ.50

దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫీజు చెల్లించి విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయగానే ధృవీకరణ సంఖ్య వస్తుంది. దీనిని దరఖాస్తులో నమోదు చేయాలి. విద్యార్థి సంతకం చేసిన  ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. ఎంచుకొన్న పాఠశాల వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తు ఫారాన్ని సబ్మిట్‌ చేశాక తప్పులు దిద్దడానికి అవకాశం ఉండదు. పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్‌ తీసుకోవాలి. కులం, ఆదాయం, పుట్టినతేదీ, వైకల్యం సంబంధిత ధృవీకరణ పత్రాలు; స్టడీ సర్టిఫికెట్‌లు సిద్దం చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31  

విద్యార్థుల ఎంపిక: జూన్‌ 10న

వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in

Read more