Family Visit Visa: ప్రవాసులకు Kuwait గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2022-05-08T18:20:03+05:30 IST

Family Visit Visa ల విషయంలో ప్రవాసులకు గల్ఫ్ దేశం కువైత్ తీపి కబురు చెప్పింది.

Family Visit Visa: ప్రవాసులకు Kuwait గుడ్‌న్యూస్

కువైత్ సిటీ: Family Visit Visa ల విషయంలో ప్రవాసులకు గల్ఫ్ దేశం కువైత్ తీపి కబురు చెప్పింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని నేటి(ఆదివారం) నుంచి తిరిగి ప్రారంభించింది. ఈద్‌ (Ramadan)కు ముందు ఆ దేశ మంత్రిమండలి కరోనాకు సంబంధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడంతో ప్రవాసుల నుంచి ఫ్యామిలీ విజిట్ వీసాల దరఖాస్తులకు మార్గం సుగమైంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో రెసిడెన్స్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ మే 8 నుంచి ఈ వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అన్నట్టుగానే ఇవాళ్టి నుంచి వీసాల జారీ ప్రారంభించింది. ఇక ఈ వీసాల కోసం ప్రవాసులు దరఖాస్తు చేసుకునేందుకు ఇంతకుముందు ఉన్న షరతులే వర్తించనున్నాయి. జాతీయత, వేతన పరిమితి, సెక్యురిటీ చెక్స్ తదితర విషయాల్లో పాత నియమాలే వర్తిస్తాయని అక్కడి మీడియా పేర్కొంది.   


ఫ్యామిలీ వీసాకు షరతులివే..

ప్రవాసుడి భార్య, 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే Family Visit Visa లు జారీ చేస్తారు. శాలరీ కండీషన్ వచ్చేసి.. వర్క్‌ పర్మిట్‌లో 500 కువైటీ దినార్లు(రూ.1.23లక్షలు) ఉన్నవారికి ఫ్యామిలీ వీసా మంజూరు చేయడం జరుగుతుంది. ఇకపోతే కమర్షియల్ విజిట్ వీసాలు, గవర్నమెంట్ విజిట్ మరియు ఈ-వీసాలు(ప్రస్తుతం 53 దేశాల వారికి) జారీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ఎంట్రీ వీసాలు, వర్క్ పర్మిట్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.  

Read more