ఇద్దరు అంగన్‌వాడీ Employee Suspension‌

ABN , First Publish Date - 2022-05-10T16:23:20+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం చూపిన ఇద్దరు అంగన్‌వాడీ ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాణిపేట జిల్లా ఆర్కాడు

ఇద్దరు అంగన్‌వాడీ Employee Suspension‌

చెన్నై/వేలూరు: విధుల్లో నిర్లక్ష్యం చూపిన ఇద్దరు అంగన్‌వాడీ ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపం వేప్పూర్‌లోని ఆదిద్రావిడుల కాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఈ నెల 4వ తేదీ కలెక్టర్‌ భాస్కర పాండ్యన్‌ పరిశీలించారు. ఆ రోజున కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు సెలవుపై ఉన్నారు. అదే సమయంలో ఆ రోజు కేంద్రానికి కేటాయించిన సరుకులను మార్కెట్‌లో విక్రయుంచినట్లు విచారణలో తేలింది. దీంతో ఆ కేంద్రం ఉద్యోగులు లోకేశ్వరి, కవితలను సస్పెండ్‌ చేశారు. 

Read more