సత్యసాయి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం

ABN , First Publish Date - 2022-05-04T07:45:04+05:30 IST

సత్యసాయి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం

సత్యసాయి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం

నేల కొరిగిన చెట్లు.. రాలిన మామిడి

రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు

విశాఖపట్నం, మే 3(ఆంధ్రజ్యోతి), తాడిమర్రి: శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల కారణంగా పండ్లతోటలకు భారీ నష్టం వాటిల్లింది. మామిడి, నేరేడు పండ్లు నేలకొరిగాయి. తాడిమర్రికి చెందిన రైతు పార్నపల్లి ప్రభాకర్‌కు చెందిన మామిడి తోటలో నాలుగు టన్నుల దాకా కాయలు నేలరాలాయి. లక్ష్మన్న అనే రైతుకు చెందిన మామిడిచెట్లు పూర్తిగా నేలకొరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. 

Read more