‘ఇస్టా’ కాంగ్రెస్ అధ్యక్షునిగా డాక్టర్ కేశవులు
ABN , First Publish Date - 2022-05-11T09:16:13+05:30 IST
అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా కాంగ్రెస్) అధ్యక్షునిగా తెలంగాణ విత్తనాభివృద్థి సంస్థ ఎండీ డాక్టర్ కునుసోత్ కేశవులు పేరు ఖరారైంది.
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా కాంగ్రెస్) అధ్యక్షునిగా తెలంగాణ విత్తనాభివృద్థి సంస్థ ఎండీ డాక్టర్ కునుసోత్ కేశవులు పేరు ఖరారైంది. ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న అంతర్జాతీయ కాంగ్రె్‌సలో ఆయన పేరును అధికారికంగా నేడో రేపో ప్రకటించనున్నారు. ఈ పదవికి ఎంపికవుతున్న మొదటి భారతీయుడు, మొదటి ఆసియా వ్యక్తి కూడా డాక్టర్ కునుసోత్ కేశవులే కావడం గమనార్హం. 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఇస్టా కాంగ్రె్‌సలో ఆయన ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇస్టా కాంగ్రె్‌సలో పాల్గొనేందుకు డాక్టర్ కునుసోత్ కేశవులు కైరో వెళ్లారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఇస్టా అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంది. అంతర్జాతీయ విత్తన వ్యాపారంలో ఇస్టా ధ్రువీకరణ చాలా కీలకం.

