పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-10T05:23:04+05:30 IST

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని సీపీ శ్వేత గజ్వేల్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. తన కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ఆమె పెండింగ్‌ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తిచేసి, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలని సూచించారు.

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత


సిద్దిపేట క్రైం, మే 9 : పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని సీపీ శ్వేత గజ్వేల్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. తన కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ఆమె పెండింగ్‌ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తిచేసి, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలని సూచించారు. ఆరు నెలల నుంచి అరెస్టు చేసిన నిందితులపై షీట్స్‌ ఓపెన్‌ చేయాలని పేర్కొన్నారు. పెండింగ్‌ కేసుల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని ఆదేశించారు. దొంగతనాల కేసులను పరిష్కరించడానికి కృషిచేయాలని సూచించారు. గంజాయి, గుట్కా, పేకాట నిర్మూలనకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. సంఘవిద్రోహశక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, ప్రతీరోజు రెండు పూటలా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్‌లో భాగంగా లాడ్జిలు, పాత నేరస్తులను తనిఖీ చేయాలని నిర్దేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బ్లూకోల్ట్స్‌, పెట్రోల్‌కార్స్‌ సిబ్బంది 100 నంబర్‌ నుంచి సమాచారం వచ్చిన 10 నిమిషాల లోపు ఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. సీసీ కెమెరాలను ప్రతీరోజు మానిటర్‌ చేయాలని, పనిచేయని వాటిని వెంటనే బాగు చేయించాలని సూచించారు. సైబర్‌ నేరాల్లో సత్వరం పరిశోధన పూర్తిచేయాలన్నారు. సమావేశంలో అడ్మిన్‌ అడిషనల్‌ డీసీపీ మహేందర్‌, గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌, సీఐలు వీరప్రసాద్‌, కమలాకర్‌, ఎస్‌ఐలు, స్పెషల్‌బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాష్‌, ఐటీసెల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Read more