కమ్ముకుంటున్న కాలుష్యం

ABN , First Publish Date - 2022-05-04T05:03:12+05:30 IST

కమ్ముకుంటున్న కాలుష్యం

కమ్ముకుంటున్న కాలుష్యం
ఇండియా సిమెంటు కర్మాగారం నుంచి వెలువడుతున్న పొగ

  • కర్మాగారాల నుంచి వెలువడుతున్న వాయువులు 
  • దుమ్మూ, ధూళితో జనం అవస్థలు 
  • శ్వాసకోశ, టీబీ వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు 
  • పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు

తాండూరురూరల్‌, మే3: తాండూరు ప్రాంతంలోని సిమెంటు కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలో ప్రధానంగా ఇండియా, పెన్నా సిమెంట్స్‌ కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కర్మాగారాల నుంచి వెలువడుతున్న పొగతో  ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మూడేళ్లుగా సంగెంకలాన్‌ గ్రామానికి చెందిన  ఓ రైతు కాలుష్య నియంత్రణా మండలి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో కేంద్ర పర్యావరణ పరిరక్షణ అధికారులకు, కేంద్రపర్యావరణశాఖ మంత్రికి రాతపూర్వకంగా ఫిర్యాదుచేశారు. దీంతో రాష్ట్రకాలుష్య నియంత్రణా మండలి అధికారులు  కొద్ది రోజుల క్రితం సంగెంకలాన్‌ గ్రామ శివారులోని రైతుపొలంలో దుమ్మును కొలిచే యంత్రాన్ని 24 గంటలపాటు ఏర్పాటు  చేశారు. తిరిగి ల్యాబ్‌కు తీసుకెళ్లి కాలుష్య తీవ్రతను చెపుతామన్న అధికారుల నుంచి  ఇప్పటికీ స్పందన లేదు. కర్మాగార యాజమాన్యాలకు కాలుష్య నియంత్రణాధికారులు తలొగ్గడం వల్లే సమయానికి ల్యాబ్‌ రిపోర్ట్‌లు అందించడం లేదని సమీప గ్రామాల రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. సిమెంటు కర్మాగారాల నుంచి వెలువడే కాలుష్యం  ఓగిపూర్‌, కరన్‌కోట్‌, మిట్టబాసుపల్లి, చంద్రవంచ, మల్కాపూర్‌, సంగెంకలాన్‌, గుంతబాస్పల్లి తదితర గ్రామాలపై ప్రభావం చూపుతోంది. దీంతో పలువురు శ్వాసకోశ, టీబీ, తదితర  వ్యాఽధుల బారిన పడుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  •  తగ్గుతున్న దిగుబడి :  జర్నప్ప, రైతు, కరన్‌కోట్‌

తాండూరు ప్రాంతంలోని పెన్నా, ఇండియా, సీసీఐ సిమెంటు కర్మాగారాల కాలుష్యంతో ప్రతి సంవత్సరం పంట నష్టం జరుగుతోంది. ఐసీఎల్‌ కర్మాగారం కాలుష్యం వెదజల్లుతూనే ఉంది. మరోపక్క పెన్నా కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం పంటలపై ప్రభావం చూపుతోంది.  పంటల దిగుబడి రావడం లేదు. 

Read more