అమరావతి: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శలు గుప్పించారు. టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జగన్ అసమర్థ పాలన నుంచి దృష్టిమరల్చేందుకే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని విమర్శించారు. జగన్ మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చారని ధూళిపాళ్ల ఆరోపించారు. ప్రజలు అధికారమిచ్చింది అభివృద్ధి చేయడానికే కానీ.. ప్రతిపక్షనేతలపై కక్షసాధింపు చర్యల కోసం కాదని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.
ఇవి కూడా చదవండి