Medical సీట్ల బ్లాకింగ్‌ నిరోధానికి కమిటీ

ABN , First Publish Date - 2022-05-14T17:46:36+05:30 IST

వైద్య విద్య ప్రవేశాల(Medical education admissions) కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సీట్ల బ్లాకింగ్‌(Seat blocking‌) వ్యవహారానికి చెక్‌ పెట్టాలని సర్కారు భావిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ(College of Health Varsity) కార్యనిర్వాహక మండలి సమావేశం జరిగింది. కౌన్సెలింగ్‌ విధానంలో ఉన్న లోపాలను గుర్తించి..

Medical సీట్ల బ్లాకింగ్‌ నిరోధానికి కమిటీ

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాల(Medical education admissions) కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సీట్ల బ్లాకింగ్‌(Seat blocking‌) వ్యవహారానికి చెక్‌ పెట్టాలని సర్కారు భావిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ(College of Health Varsity) కార్యనిర్వాహక మండలి సమావేశం జరిగింది. కౌన్సెలింగ్‌ విధానంలో ఉన్న లోపాలను గుర్తించి, కొత్త పద్ధతిని రూపొందించేందుకు ఓ కమిటీని నియమించాలని ఈసందర్భంగా నిర్ణయించారు. కాళోజీ హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌  ప్రవీణ్‌ కుమార్‌, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ఇద్దరు మెడికల్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు లీగల్‌ అడ్వైజర్లతో కమిటీని ప్రతిపాదించారు. సీటు బ్లాకింగ్‌, సీటు స్లైడింగ్‌, రిజిర్వేషన్ల అమలులో తలెత్తుతున్న ఇబ్బందులపై ఈ కమిటీ దృష్టిసారించనుంది. అలాగే మన రాష్ట్రంలో మెడికల్‌ రిసెర్చ్‌ సరిగ్గా జరగడం లేదన్న ఆరోపణలున్నాయి.  వైద్య పరిశోధనల కోసం కూడా ఒక విధానాన్ని సిద్ధం చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. అందుకోసం కూడా ఒక కమిటీని వేయనుంది. ఇందులో డీఎంఈ రమేశ్‌రెడ్డితో పాటు ప్రముఖ డాక్టర్‌, ఏఐజీ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, గచ్చిబౌలి టిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విమలా థామస్‌ ఉండనున్నారు.

Read more