రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే ఏకైక లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-12T16:10:41+05:30 IST

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. 2020-21 సంవత్సరంలో అంతర్జాతీయ వాణిజ్య

రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే ఏకైక లక్ష్యం

- సీఎం స్టాలిన్‌ వెల్లడి

- వాణిజ్య ఎగుమతుల్లో రాష్ట్రానికి మూడోస్థానం 


అడయార్‌(చెన్నై): రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. 2020-21 సంవత్సరంలో అంతర్జాతీయ వాణిజ్య ఎగుమతుల్లో దేశంలో తమిళనాడు మూడోస్థానంలో నిలిచిందనిన ఆయన వెల్లడించారు. నగరంలో బుధవారం దక్షిణ భారత ఎగుమతిదారుల ప్రాంతీయ మండలి సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ దక్షిణ భారత ఎగుమతిదారుల ప్రాంతీయ మండలిలో దేశ వ్యాప్తంగా మొత్తం 35 వేల మంది సభ్యులు ఉండగా, ఇందులో ఒక్క తమిళనాడు నుంచే 5 వేల మంది సభ్యులుగా ఉండటం ఎంతో గర్వకారణంగా, సంతోషంగానూ ఉందన్నారు. 2020-21 సంవత్సరంలో దేశ అంతర్జాతీయ వాణిజ్యం విలువ 1,93,000 కోట్లు అని, ఇందులో 8.97 శాతంతో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. ఈ శాతం ప్రతి యేటా పెరగాలన్నారు. మోటార్‌ వాహనాలు, దుస్తులు, ఖాదీ వస్త్రాలు, పాదరక్షకులు, రబ్బర్‌ వంటి పలు రకాల వస్తువుల ఎగుమతిలో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని, తద్వారా కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు.  ప్రస్తుతం రాష్ట్ర ఎగుమతుల విలువ 26 మిలియన్‌ డాలర్లుగా ఉందని, దీన్ని 2030 నాటికి 100 మిలియన్‌ డాలర్లకు పెంచాలని కోరారు. ఇందుకోసం ఒక ప్రణాళికను గత యేడాది సెప్టెంబరు 22న వెల్లడించామన్నారు. రాష్ట్రం ఇపుడు ఉన్న స్థానం కంటే మరింత మెరుగైన స్థానంలో నిలిపేందుకు ఎగుమతులు మరింతగా పెరగాలని, ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ పలువురు పారిశ్రామికవేత్తలను సన్మానించారు. 

Read more