అమరావతి: జగన్ పాలనతో ఏపీ నరకాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... అత్యాచారాలు, దాడులు, రైతు ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం తల్లడిల్లుతోందన్నారు. ఒక్క ఏప్రిల్‌లోనే 31 అత్యాచార, దాడుల ఘటనలు జరిగాయన్నారు. గత నెలలో 26 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి పరిశ్రమలు రాక... ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసలు పడుతున్నారని చెప్పారు. మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యలపై పోరాటాలకు పార్టీ కమిటీలు వేసినట్లు తెలిపారు.వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని చెప్పారు. దాచేపల్లిలో టీడీపీ నేత కానిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో తల్లికి పింఛన్ ఇవ్వలేదని ప్రశ్నించిన కుమారుడిపై దాడి చేయడం హేయమని అన్నారు. ఈ దాడిని ఖండించారు. శ్రీకాళహస్తిలో నామినేషన్‌కు వెళ్తున్న టీడీపీ నేత చలపతినాయుడుపై దాడికి పాల్పడటం దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి