ముంబై: ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)లో మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది. ఇంకా తెరిచే ఉన్న ప్లే ఆఫ్స్ ద్వారాలవైపు ఆశగా ఎదురుచూస్తోంది. ముంబైతో విజయం అనంతరం కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) మాట్లాడుతూ.. తుది జట్టులో మీరు లేరని ఆటగాళ్లకు చెప్పడం ఎంతో కష్టమైన విషయమని అన్నాడు. జట్టు సెలక్షన్లలో సీఈవో వెంకటీ మైసూర్ కూడా పాలుపంచుకుంటారని పేర్కొన్నాడు.
తుది 11మందిలో చోటు దక్కని ఆటగాళ్లకు ఆ విషయం చెప్పడం నిజంగా ఎంతో కష్టమని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఐపీఎల్‌లో ఆడడం ప్రారంభించినప్పుడు తాను కూడా అదే పరిస్థితిల్లోనే ఉన్నానని అన్నాడు. జట్టు ఎంపికలో సీఈవో కూడా ఉంటారని పేర్కొన్నాడు. జట్టు ఎంపిక అనంతరం బ్రెండన్ మెకల్లమ్ ఆటగాళ్లతో ఆ విషయం చెబుతాడన్నాడు. నిజం చెప్పాలంటే నిర్ణయాలు తీసుకునే సమయంలో అందరూ చాలా సపోర్టివ్‌గా ఉంటారని, మైదానంలోకి దిగాక ఒకరికొకరు అండగా నిలబడతారని అన్నాడు. ముంబైపై ఆటతీరుకు ఒక కెప్టెన్‌గా గర్వంగా, ఆనందంగా ఉందని శ్రేయాస్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి