సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... మూసివేత దిశగా 600 శాఖలు ?

ABN , First Publish Date - 2022-05-06T03:04:26+05:30 IST

జాతీయ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ)... తన శాఖల్లో కొన్నింటిని మూసివేయనుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవసస్తోంది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...  మూసివేత దిశగా 600 శాఖలు ?

ముంబై : జాతీయ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ)... తన శాఖల్లో కొన్నింటిని మూసివేయనుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవసస్తోంది. కనీసం 13 శాతం(600) శాఖలను మూసివేయాలని, లేదా... విలీనం చేయాలని సీబీయో యోచిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఈ ప్రధాన జాతీయ బ్యాంకు తన 13 శాతం శాఖలను మూసివేయాలని యోచిస్తున్నట్లుగా వినవస్తోంది.


ప్రభుత్వాధీనంలో ఉన్న సీబీఐ... ఆర్థిక సమస్యలను తగ్గించుకునే క్రమంలో 13 శాతం శాఖలను మూసివేయాలని యోచిస్తున్నట్లుగా సంబంధిత వర్గాల నుంచి వినవస్తోంది. సీబీఐ... మార్చి 2023 చివరి నాటికి దాని పరిమాణంలో గణనీయమైన తగ్గింపును చూడనుందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఆర్ధికసంక్షోభం నుంచి బయటపడే క్రమంలో...  బ్యాంక్‌ను మూసివేయడమో, లేదా...  నష్టాన్ని కలిగించే అనేక శాఖలను విలీనం చేయడమో చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.


బ్యాంక్ తన ఆర్థిక స్థితిని మెరుగుపరచుకునే యత్నంలో భాగంగా... రియల్ ఎస్టేట్ వంటి నాన్-కోర్ ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్ధికంగా తీవ్ర ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పనే చెబుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వంద సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీబీఐకి... 4,594 శాఖల నెట్‌వర్క్‌ ఉంది. ఐదేళ్ళ క్రితం... 2017 లో... కొన్ని ఇతర రుణ సంస్థలతో పాటు RBI సంబంధిత ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్(PCA) క్రింద చేర్చారు. సీబీఐతో పాటు, ఇతరత్రా కొన్ని బ్యాంకులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ద్వారా ఈ జాబితా నుండి బయటపడ్డాయి.

Read more