బిల్ గేట్స్‌కు... కోవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2022-05-11T22:15:38+05:30 IST

మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం ట్విట్టర్‌లో.. ‘నేను COVID-19 పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అని తేలింది. అయితే... తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను మళ్లీ ఆరోగ్యంగా ఉండే వరకు ఒంటరిగా ఉండటం ద్వారా నిపుణుల సలహాలను అనుసరిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

బిల్ గేట్స్‌కు... కోవిడ్ పాజిటివ్

క్యాలిఫోర్నియా : మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం ట్విట్టర్‌లో.. ‘నేను COVID-19 పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అని తేలింది. అయితే...  తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను మళ్లీ ఆరోగ్యంగా ఉండే వరకు ఒంటరిగా ఉండటం ద్వారా నిపుణుల సలహాలను అనుసరిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ‘నేను టీకాలు వేయడం, పరీక్షలు సహా గొప్ప వైద్య సంరక్షణకు కలిగి ఉండటం నా అదృష్టం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా... బిల్ గేట్స్ ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లోకెక్కుతోన్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం... భార్య మిలిండాతో విడాకులు, ఆ తర్వాత మళ్ళీ వివాహం, భారీ దాతృత్వం తదితర ప్రకటనలతో వార్తల్లో నిలిచిన గేట్స్... ఇప్పుడు కరోనా కారణంగా మరోమారు వార్తలకెక్కారు. 

Read more