BECILలో ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2022-05-03T18:47:03+05:30 IST

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) - క్రింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది...

BECILలో ఇంటర్వ్యూలు

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌)  - క్రింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఖాళీలు: 7

ఉద్యోగాలు: అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌ 1, రేడియోథెరపీ టెక్నీషియన్‌లు 4, ఓటీ టెక్నీషియన్‌లు 2

అర్హత: అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌కు డిప్లొమా ఇన్‌ ఫార్మసీ ఉత్తీర్ణతతోపాటు ఫార్మసిస్ట్‌గా గుర్తింపు పొంది ఉండాలి. రేడియోథెరపీ టెక్నీషియన్‌కు బీఎస్సీ(రేడియోథెరపీ) ఉత్తీర్ణతతోపాటు రేడియోథెరపీ ఎక్వి్‌పమెంట్‌ ఆపరేటింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా డిప్లొమా ఇన్‌ రేడియోథెరపీ టెక్నాలజీ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. ఓటీ టెక్నీషియన్‌కు ఇంటర్‌(సైన్స్‌) ఉత్తీర్ణతతోపాటు బీఎస్సీ (థియేటర్‌ టెక్నాలజీ) పూర్తిచేసి ఐసీయూ ట్రెయినింగ్‌ పొంది ఉండాలి. లేదా డిప్లొమా ఇన్‌ థియేటర్‌ టెక్నాలజీ పూర్తిచేసి ఓటీ, ఐసీయూ విభాగాల్లో ఏడాది పాటు పనిచేసిఉండాలి. 

ఇంటర్వ్యూలు: అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌కు మే 6న, రేడియోథెరపీ టెక్నీషియన్‌కు మే 9న, ఓటీ టెక్నీషియన్‌కు మే 17న

వేదిక: చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, స్ట్రీట్‌ నెం. 299, డీజే బ్లాక్‌, యాక్షన్‌ ఏరియా 1, న్యూ టౌన్‌, కోల్‌కతా - 700156

వెబ్‌సైట్‌: becil.com

Read more