Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 12 May 2022 16:06:21 IST

Viral Video: కాసేపు ఆగండంటూ పెళ్లిని మధ్యలోనే ఆపేసిన వధువు.. కారణమేంటో తెలిసి పగలబడి నవ్విన బంధువులు..!

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: కాసేపు ఆగండంటూ పెళ్లిని మధ్యలోనే ఆపేసిన వధువు.. కారణమేంటో తెలిసి పగలబడి నవ్విన బంధువులు..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి తనకు ఇష్టమైన వాడితో పెళ్లికి సిద్ధమైంది. పెళ్లికి సన్నిహితులు, స్నేహితులందర్నీ పిలిచింది. ఈ క్రమంలో వాళ్లంతా వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. ఇంతలో అందంగా ముస్తాబై ఆ యువతి కూడా అక్కడకు వచ్చేసింది. వరుడు కూడా అక్కడే ఉంటడంతో వివాహ కార్యక్రమం మొదలైంది. అయితే అనూహ్యంగా పెళ్లిని ఆ యువతి మధ్యలోనే ఆపేసింది. అందుకు కారణం ఏంటో తెలుసుకుని బంధువులు సహా అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే.. 


చిన్న కారణంతో ఓ వధువు తన పెళ్లిని మధ్యలోనే కొద్దిసేపు ఆపేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సహజంగానే ఆడవాళ్లు వస్త్రధారణపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పెళ్లి విషయానికి వస్తే వారి హడావిడి సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది కదా. ఈ కోవకు చెందన ఓ యువతి కూడా తన పెళ్లి కోసం ఎంతో అందమైన డ్రెస్‌ను డిజైన్ చేయించుకుంది. ఈ క్రమంలోనే అందంగా ముస్తాబై వివాహ వేదిక వద్దకు చేరుకుంది. దీంతో వివాహ వేడుక కూడా మొదలైంది. ఇంతలో ఆ వధువుకు ఓ విషయం గుర్తొచ్చింది. ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న డ్రెస్‌లో సగభాగం మిస్సైందని గ్రహించి.. వెంటనే మైక్ తీసుకుని విషయం వివరించి మరీ పెళ్లిని కాసేపు మధ్యలో ఆపేసింది. వధువు మాటలు విని అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. అయితే.. కొందరు యువతులు వచ్చి.. వధువుకు పూర్తి వస్త్రధారణ చేసిన అనంతరం వివాహ కార్యక్రమం మళ్లీ మొదలైంది. కాగా.. ఈ దృశ్యాలన్నీ కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 3.13లక్షల మంది వీక్షించి.. ఫన్నీగా కామెంట్ చేశారు. 



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.