KCRకు Bojjala అత్యంత సన్నిహితుడు

ABN , First Publish Date - 2022-05-06T23:23:30+05:30 IST

మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బొజ్జల కుటుంబసభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు.

KCRకు Bojjala అత్యంత సన్నిహితుడు

అమరావతి: మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బొజ్జల కుటుంబసభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. తన సహచరుడు, ఆత్మీయుడిని కోల్పోయానని కేసీఆర్‌ తెలిపారు. కేసీఆర్, బొజ్జల ఇద్దరు టీడీపీలో ఉన్నప్పుడు సన్నిహితంగా మెలిగేవారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్‌తో బొజ్జల సంప్రదింపులు జరిపారని పలువురు అంటున్నారు. బొజ్జల గోపాలకృష్ణ మరణంపై పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మిత్రుడు, పార్టీ సీనియర్‌ నేతను కోల్పోయామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నిత్యం అభివృద్దిని కాంక్షించే ప్రజా నేతను కోల్పోయామని ఎంపీ సీఎం రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలకృష్ణారెడ్డి మరణం పట్ల మంత్రి దేవినేని ఉమా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.


బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి srikalahasti constituency నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం Chandrababu కాబినెట్‌లో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. Gopala Krishna Reddy మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read more