దమ్ముంటే మళ్లీ నాపై పోటీ చేయాలి...కవితకు అరవింద్ సవాల్

ABN , First Publish Date - 2022-05-05T18:05:30+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ ధర్మపురరి అరవింద్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కవిత వ్యాఖ్యలపై ఎంపీ కౌంటర్ ఇచ్చారు.

దమ్ముంటే మళ్లీ నాపై పోటీ చేయాలి...కవితకు అరవింద్ సవాల్

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  కవితకు దమ్ముంటే మళ్ళీ తనపై పోటీచేయాలని అరవింద్ సవాల్ విసిరారు. ఓటమి మత్తు దిగటంతో కవిత మూడేళ్ళ తర్వాత బయటకొచ్చిందని వ్యంగ్యాస్త్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నాపై రాజకీయ పోరాటానికి కవిత సిద్దంగా ఉండాలి. పసుపు బోర్డుపై పసుపు రైతుల సమక్షంలో కవితతో చర్చకు సిద్ధం. ధైర్యముంటే సెక్యూరిటీని పక్కన పెట్టి కవిత చర్చకు రావాలి. మహిళ కాబట్టి బతికిపోతోంది.  పసుపు రైతుల చేతిలో కవితకు పరభావం తప్పదు. తండ్రి, అన్న మాదిరి కవిత .. చిల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారు. కవిత చెప్పే మాటలు వింటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు’’ అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యమని ఎంపీ స్పష్టం చేశారు. గులాబీలకు, పింకీలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రజలకు మాత్రమే తాను జవాబుదారీ అని,  టీఆర్ఎస్ పతనమే బీజేపీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌ను పాతాళానికి తొక్కేయటానికే జేపీ నడ్డా పర్యటన అని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. 

Read more