అతిరథ మహారథులు అతిథులుగా ఆటా డీసీ కాన్ఫరెన్స్ 2022

ABN , First Publish Date - 2022-05-06T02:48:17+05:30 IST

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తొలిసారిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 17వ కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్‌ను నిర్వహిస్తోంది. వాషింగ్టన్ డీసీ వాల్తేర్ ఏ కన్వెన్షన్ సెంటర్లో

అతిరథ మహారథులు అతిథులుగా ఆటా డీసీ కాన్ఫరెన్స్ 2022

ఎన్నారై డెస్క్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తొలిసారిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 17వ కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్‌ను నిర్వహిస్తోంది. వాషింగ్టన్ డీసీ వాల్తేర్ ఏ కన్వెన్షన్ సెంటర్లో జులై 1-3 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సద్గురు, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్, కపిల్ దేవ్, బాలకృష్ణ తదితరులు విచ్చేయచున్నారు. ఆబాలగోపాలాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించే మాస్ట్రో ఇళయరాజా & ట్రూప్‌తో నిర్వహించే మ్యూజికల్ నైట్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.  


బిజినెస్, రాజకీయ, సామాజిక, సాహిత్య, కవులు కళాకారులు, ప్రముఖులు, మేధావులు ఎంతో మంది ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1౦,౦౦౦ మందికి పైగా పాల్గొంటారని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కవిత, జి.ఎం.ర్., ఉపాసన కామినేని తదితరులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినట్లు చెప్పారు.



అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల అధ్యక్షతన సుధీర్ బండారు కన్వీనర్గా, క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ కో-హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ కాన్ఫరెన్స్‌కి తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేకతను చాటవలసిందిగా ఆటా కార్యవర్గం ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 7000  పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్లో మినీ షాపింగ్ మాల్ తరపించనుంది. 200  పైగా ప్రత్యేక స్టాల్ల్స్ ప్రత్యేక ఆకర్షణ - రియల్ ఎస్టేట్, జ్యువలరీ, చీరలు, ఇన్సూరెన్స్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టాల్ల్స్ ఆహుతులను అలరించనున్నాయి.  మిగిలి ఉన్న అతి కొద్ది వేండొర్ బూత్స్ కొరకు త్వరగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాల్లో కోసం https://www.ataconference.org/exhibits ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.




Read more