ఇంకా వెంటిలేటర్‌పై పోరాడుతున్న చిన్నారి ఆరాధ్య

ABN , First Publish Date - 2022-05-12T18:27:00+05:30 IST

చిన్నారి ఆరాధ్య ఇంకా వెంటిలేటర్‌పైనే పోరాడుతోంది. కంటి కింద కణితి తొలగించాలని గత గురువారం జీజీహెచ్‌లో చేరింది.

ఇంకా వెంటిలేటర్‌పై పోరాడుతున్న చిన్నారి ఆరాధ్య

గుంటూరు : చిన్నారి ఆరాధ్య ఇంకా వెంటిలేటర్‌పైనే పోరాడుతోంది. కంటి కింద కణితి తొలగించాలని గత గురువారం జీజీహెచ్‌లో చేరింది. అయితే చిన్న ఆపరేషనేనని.. క్షణాల్లో పూర్తవుతుందని చెప్పి జీజీహెచ్ వైద్యులు పాప ప్రాణాలకే ప్రమాదం తలపెట్టిన విషయం తెలిసిందే. శనివారం ఆపరేషన్ అనంతరం ఆరాధ్య అపస్మారస్థితిలోకి వెళ్లింది. మెరుగైన వైద్యం కోసం సోమవారం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఓ కమిటీ వేశారు. 6 రోజులు గడిచినా చిన్నారి ఇంకా వెంటిలేటర్‌పైనే ఉంది.

Read more