Srilanka సీతాదేవి ఆలయంలో అన్నామలై

ABN , First Publish Date - 2022-05-03T16:34:50+05:30 IST

మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు వెళ్ళిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అక్కడి సీతామాత ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

Srilanka సీతాదేవి ఆలయంలో అన్నామలై

చెన్నై: మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు వెళ్ళిన బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు అన్నామలై అక్కడి  సీతామాత ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి 182 కి.మీ. దూరంలోని నువేరాఎలియా జిల్లాలో వెయ్యేళ్లనాటి సీతాదేవి ఆలయం ఉంది. రావణాసురుడు సీతాదేవిని నిర్బంధించిన ప్రాంతంలోనే ఆ ఆలయం ఉందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఆ ఆలయంలో ప్రాచీన సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ శిల్పాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయ నిర్వహణ బాధ్యతలను భారతీయ సంతతికి చెందిన తమిళ ప్రముఖులు నిర్వర్తిస్తున్నారు. ఇంతటి ఖ్యాతి చెందిన ఆ ఆలయాన్ని అన్నామలై దర్శించారు. ఆలయం వద్ద ఆయనకు ప్రధానార్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు ఆయనకు ప్రసాదాలను అందజేశారు. ఈ ఆలయ సందర్శనపై అన్నామలై ట్విట్టర్‌లో  పోస్టు చేసిన ఓ సందేశంలో శ్రీలంక, భారతదేశ చరిత్ర, నాగరికత ఇంచుమించూ ఒకే విధంగా ఉన్నాయని, సుప్రసిద్ధమైన సీతామాత ఆలయాన్ని సందర్శించడం వింత అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.

Read more