పైలట్ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాడని.. ప్రయాణీకుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-05-12T17:55:26+05:30 IST

విపత్తు సంభవించినప్పుడు మనిషి...

పైలట్ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాడని.. ప్రయాణీకుడు ఏం చేశాడంటే..

విపత్తు సంభవించినప్పుడు మనిషి ఎంతటి పనినైనా చేయగలడని అంటారు. అటువంటి సమయాల్లో భగవంతుని మీద భారం వేసి, పెద్ద బాధ్యతను స్వీకరించడానికి కూడా ఉపక్రమిస్తారు. విమానం నడపడంలో అస్సలు అనుభవం లేని ఒక ప్రయాణీకుడు అద్భుతం చేశాడు. ఈ ఘటన పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పైలట్ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడంతో ఒక ప్రయాణీకుడు విమానాన్ని నడిపేందుకు ముందుకు వచ్చాడు. 


ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పైలట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఈ విషయం తెలిసింది. దీంతో వారిలో వణుకు పుట్టింది.  నిజానికి విమానం నడపాలంటే దాదాపు 60 గంటల శిక్షణ అనుభవం, కనీసం 10 గంటల పర్యవేక్షణ అవసరం. అయితే దీనిని అధిగమిస్తూ ఒక ప్రయాణీకుడు అనుభవ రాహిత్యంతో విమానాన్ని నడిపాడు. అయితే ఆ విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేయడం విశేషం. 14 సీట్ల సెస్నా కారవాన్ విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడి నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి రేడియోలో ఒక సందేశం వచ్చింది. 'ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. మేము ప్రయాణిస్తున్న విమానంలోని పైలట్ అనారోగ్యంతో ఉన్నాడు. విమానం ఎలా నడపాలో నాకు తెలియదు' అని దాని సందేశం. దీంతో కంట్రోరూం సిబ్బంది ఆ ప్రయాణీకునికి పలు సూచనలు చేశారు. వాటిని ఫాలో అవుతూ బోకా రాటన్‌కు ఉత్తరాన 25 మైళ్ల దూరంలో ఉన్న పామ్ బీచ్‌లో విమానాన్ని ఆ ప్రయాణీకుడు దించాడు. ఈ ఉదంతం గురించి ఏవియేషన్ నిపుణుడు జాన్ నాన్స్ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. ఏరోనాటికల్ అనుభవం లేని వ్యక్తి విమానాన్ని ల్యాండ్ చేయడాన్ని చూడటం ఇదే మొదటిసారి అని పేర్కొన్నాడు. 


Read more