చంద్రుడి మట్టిపై వ్యవసాయం సాధ్యమే!

ABN , First Publish Date - 2022-05-14T08:18:42+05:30 IST

చంద్రుడిపైకి వెళ్లేందుకు పలు దేశా లు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. మరి సుదీర్ఘకాలం పాటు చంద్రుడిపై నివసించాలంటే.. ప్రతిసారీ భూమి నుంచి

చంద్రుడి మట్టిపై వ్యవసాయం సాధ్యమే!

మొక్కల్ని పెంచిన నాసా పరిశోధకులు


న్యూఢిల్లీ, మే 13: చంద్రుడిపైకి వెళ్లేందుకు పలు దేశా లు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. మరి సుదీర్ఘకాలం పాటు చంద్రుడిపై నివసించాలంటే.. ప్రతిసారీ భూమి నుంచి ఆహారాన్ని తీసుకెళ్లడం కాస్త కష్టమైన పనే. చంద్రుడిపైనే మొక్కల్ని పెంచి ఆహార సమృద్ధిని సాధిస్తే..? ఇదే ఆలోచనతో పరిశోధనలు నిర్వహించారు అమెరికాలోని ఫ్లోరిడా పరిశోధకులు. అపోలో 11, 12, 17 మిషన్ల ద్వారా భూమికి తీసుకొచ్చిన చంద్రుడి మట్టిపై అరబిడోప్సిస్‌ తాలియానా అనే మొక్కను తాజాగా విజయవంతంగా పరిశోధకులు పెంచగలిగారు. పరిశోధనలో భాగంగా.. ఒక గ్రాము చంద్రుడి మట్టిలో విత్తనాలను, నీటిని పోసి పె ట్టెలో పెట్టి ఉంచారు. పోషక విలువలున్న ఎరువును రోజూ కొద్దికొద్దిగా అందించారు. రెండు రోజులకే మొక్కలు పెరగడం మొదలైందని, 20 రోజుల్లోనే కోతకొచ్చాయని పరిశోధకులు వెల్లడించారు. ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పెరిగే అరబిడోప్సిస్‌ తాలియానా మొక్క.. బ్రొకోలీ, కాలీఫ్లవర్‌, బ్రసె ల్స్‌ స్ర్పౌట్స్‌ వంటి వాటికి దగ్గరిగా ఉంటుంది. మనుషుల ఆహారంగా ఉపయోగపడుతుంది. 

Read more