ఆకలి లేకపోయినా వేటాడే జంతువు!

ABN , First Publish Date - 2022-05-07T05:30:00+05:30 IST

ఆకలి లేకపోయినా వేటాడే జంతువు!

ఆకలి లేకపోయినా వేటాడే జంతువు!

పులి మన జాతీయ జంతువు అని తెలిసిందే. అయితే మనదేశంతో పాటు బంగ్లాదేశ్‌, మలేసియా, దక్షిణ కొరియా దేశాల జాతీయ జంతువు కూడా ఇదే. మరిన్ని విశేషాలు ఇవి...

పులి ఎక్కువగా రాత్రిపూట వేటాడుతుంది. ఒకరోజు 40 కేజీల వరకు మాంసాన్ని తింటుంది. ఆకలి లేకపోయినా వేటాడటం మాత్రం ఆపదు. మరో విశేషమేమిటంటే పులిని ఏ జంతువు తినదు. మనుషుల వల్లనే  పులులకు ప్రమాదం పొంచి ఉంది. అడవులు నరకడం, వేటాడటం వల్ల అవి అంతరించిపోతున్నాయి.

ఇది 13 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. ఇక బరువు 300 కేజీల వరకు ఉంటుంది. పులి జీవితకాలం 20 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. 

పులి పిల్లలను కబ్స్‌ అంటారు. కబ్స్‌ పుట్టిన ఒకటి రెండు వారాలకు కళ్లు తెరుస్తాయి. ఆరు నెలల తరువాత వేటాడటం నేర్చుకుంటాయి. 18 నెలలు వచ్చే వరకు తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. 

పులుల సమూహాన్ని అంబుష్‌ అంటారు. పులి గంటకు 60 కి.మీ వేగంతో పరుగెత్తగలదు. 

రకరకాలుగా అరవడం ద్వారా పులులు సంభాషించుకుంటాయి. ఇవి ఇతర జంతువుల్లా మిమిక్రీ చేయగలవు. సాంబార్‌ జింకను వేటాడే సమయంలో జింక మాదిరిగా అరుస్తూ వాటిని వేటాడతాయి. 

నీళ్లలో ఆడటాన్ని పులులు ఇష్టపడతాయి. 

Read more