ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSS: బంగారు పూతపూసిన పేజీలు ఈ కాపీ ప్రత్యేకత

ABN, First Publish Date - 2023-02-14T18:38:03+05:30

సాధకులు ఆధ్యాత్మిక పురోగతిని వేగవంతం చేసుకోవడం, అలాగే నిత్యమైన యవ్వనోత్సాహాన్ని వ్యక్తపరిచే అనేక విషయాలపై ఇందులో...

YSS New Books
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కన్హా శాంతి వనం (Kanha Shanthi Vanam)లో యోగదా సత్సంగ సొసైటీ (YSS) / సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (SRF) ఆధ్వర్యంలో జరుగుతున్న వైఎస్ఎస్ సంగం కార్యక్రమంలో ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు స్వామి చిదానంద గిరి (Swami Chidananda Giri) "ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం" పుస్తకాన్ని విడుదల చేశారు. యోగదా సత్సంగ సొసైటీ (Yogoda Satsanga Society) / సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (Self Realization Fellowship) వ్యవస్థాపకులు పరమహంస యోగానంద (Paramahamsa Yogananda) ఈ పుస్తక రచయిత. దైనందిన జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడంపై పరమహంస యోగానంద ప్రసంగాలు, వ్యాసాల పరిశీలనే ఈ పుస్తకం. సాధకులు ఆధ్యాత్మిక పురోగతిని వేగవంతం చేసుకోవడం, అలాగే నిత్యమైన యవ్వనోత్సాహాన్ని వ్యక్తపరిచే అనేక విషయాలపై ఇందులో ప్రస్తావించారు. జ్ఞాన మార్గం ద్వారా కర్మను జయించడం, గురువుతో అనుసంధానంలో ఉండటం ద్వారా వివేకంతో పని చేయడం, కష్టాలను విజయాలుగా మార్చడం, నిస్వార్ధంగా ఉండడంలోని ఆనందం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఎలాగో ఈ పుస్తకంలో రచయిత వివరించారు.

ఇదే కార్యక్రమంలో 150 చిత్రాలు అదనంగా జతచేసి ప్రచురించిన "ఒక యోగి ఆత్మ కథ" డీలక్స్ కాపీని స్వామి చిదానందగిరి విడుదల చేసారు. బంగారు పూతపూసిన పేజీలు ఈ డీలక్స్ కాపీ ప్రత్యేకత. కార్యక్రమంలో ఇతర భాషలకు చెందిన పలు పుస్తకాలను కూడా స్వామి చిదానంద గిరి విడుదల చేశారు.

ఈ పుస్తకాల కోసం https://bookstore.yssofindia.org వెబ్ సైట్‌ని సందర్శించవచ్చని నిర్వాహకులు తెలియజేశారు.

Updated Date - 2023-02-14T18:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising