ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSS: ప్రపంచ నాగరికతకు మూలం భారతీయం - స్వామి చిదానందగిరి

ABN, First Publish Date - 2023-02-12T19:53:21+05:30

పరమహంస యోగానంద చెప్పినట్లుగా... ప్రపంచం ముక్కలవుతున్నప్పటికీ చెక్కుచెదరకుండా స్థిరంగా నిలబడాలంటే ఆత్మాలయంలో స్థిరంగా నిలబడాలని, తద్వారా విజేతగా ఉండడానికి

Swamy Chidananda Giri
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారతదేశంలో భగవంతుడే జాతి జీవన సూత్రమని, ఈ జీవన విధానమే ప్రపంచ నాగరికతకు ఆధారమని యోగదా సత్సంగ సొసైటీ (YSS), సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (SRF) అంతర్జాతీయ అధ్యక్షులు స్వామి చిదానందగిరి (Swami Chidananda Giri) అన్నారు. హైదరాబాద్‌లోని కన్హ ఆశ్రమం (Kanha Ashram)లో ఆదివారం జరిగిన వైఎస్ఎస్ సంగం (YSS Sangam) ప్రారంభోత్సవ వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగం చేశారు. మానవజాతికి ఒక భద్రమైన, సమృద్ధమైన, ఆనందమయమైన భవిష్యత్తు కావాలంటే ఈ చైతన్యాన్ని ప్రపంచ మానవులందరిలో నెలకొల్పాలని అయన సూచించారు. స్వర్ణమయమైన సనాతన భారతీయ ఆధ్యాత్మిక నాగరికతకు, భవిష్యత్తులో రాబోయే ఏక ప్రపంచ ఆధ్యాత్మిక నాగరికతకు మధ్య, వారధులుగా తయారుకావాలని భక్తులకు అయన పిలుపునిచ్చారు.

యోగదా సత్సంగ సొసైటీ (Yogoda Satsanga Society) వ్యవస్థాపకులు పరమహంస యోగానంద (Paramahansa Yogananda) ధ్యానం, సంఘం, గురుకృపతో కూడిన 3 అంశాల సాధనా మార్గాన్ని ప్రసాదించారని స్వామి చిదానందగిరి చెప్పారు. ఈ మూడింటి సమ్మేళనమే ఈనాటి కార్యక్రమ ప్రధాన సూత్రమని తెలిపారు. దీన్ని "క్రియాయోగ శరణం"గా అయన అభివర్ణించారు. తద్వారా దివ్యానందం, దివ్యకాంతి అనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని ఆయన చెప్పారు. నిత్యం క్రమం తప్పకుండా చేసే శాస్త్రీయ క్రియాయోగ సాధన ద్వారా శాశ్వత పరమాత్మతత్వంలో శరణు పొందాలన్నారు. పరమహంస యోగానంద చెప్పినట్లుగా... ప్రపంచం ముక్కలవుతున్నప్పటికీ చెక్కుచెదరకుండా స్థిరంగా నిలబడాలంటే ఆత్మాలయంలో స్థిరంగా నిలబడాలని, తద్వారా విజేతగా ఉండడానికి దృఢసంకల్పం చేసుకోవాలని స్వామి చిదానందగిరి సూచించారు. అయితే ముందుగా జ్ఞాన ఖడ్గంతో అవిద్యాజనిత సందేహాలన్నిటినీ ఖండించి పారవేయాలన్నారు

కనుబొమ్మల మధ్య బిందువు మీద దృష్టిని ఏకాగ్రం చేస్తే, ఆంతరంగంలో నుంచి ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుందని స్వామి చిదానంద గిరి వివరించారు. ఈ అలౌకిక చైతన్యమే జీవితానికి గొప్ప రక్షణ అని ఆయన సందేశమిచ్చారు.

ఈ కార్యక్రమానికి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (Self Realization Fellowship) ఉపాధ్యక్షులు స్వామి విశ్వానందగిరి, యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి స్మరణానందగిరి (Swami Smarananda Giri), ప్రధాన కార్యదర్శి స్వామి ఈశ్వరానందగిరి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేశవిదేశాల నుంచి విచ్చేసిన 3200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వేలాది మంది వీక్షించారు. ఈ కార్యక్రమాలు ఫిబ్రవరి 16 వరకు కొనసాగుతాయి.

Updated Date - 2023-02-12T19:53:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising