ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tarakaratna: తారకరత్న నివాసానికి బాలకృష్ణ

ABN, First Publish Date - 2023-02-19T16:30:00+05:30

నందమూరి తారకరత్న (Tarakaratna) నివాసానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నందమూరి తారకరత్న (Tarakaratna) నివాసానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. తారకరత్నను బెంగళూరులోని (Bangalore) నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి తారకరత్న వెంటే ఉంటూ బాలయ్య అన్నీ తానై చూసుకున్నారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు చాలా తాపత్రయపడ్డారు. అటు డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకుంటూ.. ఇటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వచ్చారు బాలయ్య. ప్రతి వారం బాలకృష్ణ ఆసుపత్రి వస్తూ మెడికల్ బిల్లులు చెల్లిస్తూ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేవారు. వాస్తవానికి ప్రతి సోమవారం బాలకృష్ణ ఆసుపత్రికి వస్తున్నారు. కానీ నిన్న తారకరత్నకు ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి వచ్చారు. బాలకృష్ణకు తారకరత్న అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తారకరత్నకు కూడా బాలయ్య అంటే ఎంతో ఇష్టం. అంతకుమించి గౌరవం. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదని అందరూ చెబుతుంటారు.

ప్రముఖుల సంతాపం..

నందమూరి తారకరత్న మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్ర్భాంతిని, బాధను కలిగించిందని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు. ఆయనను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యులు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి దూరమై.. తమ కుటుంబానికి విషాదం మిగిల్చారన్నారు. తారకరత్న మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

రేపు అంత్యక్రియలు

శనివారం రాత్రి 11గంటలకు తారకరత్న పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌ నగర శివార్లలోని మోకిలలో ఉన్న ఆయన స్వగృహానికి అంబులెన్స్‌లో తరలించారు. ఆదివారం అక్కడే ఉంచి సోమవారం ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌ కార్యాలయం వద్ద ప్రజల సందర్శనార్థం ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Tarakaratna : తారకరత్న కన్నుమూత

Updated Date - 2023-02-19T16:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising