ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: SRH ఘోర ఓటమికి ఇదో పెద్ద కారణం.. చావు దెబ్బ తీశావ్ కదయ్యా..!

ABN, First Publish Date - 2023-04-03T13:48:06+05:30

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్లు తలపడ్డాయి. గతేడాది ఫామ్‌ను కొనసాగిస్తూ బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుగ్గా రాణించిన రాజస్థాన్ టీమ్ హైదరాబాద్‌పై సునాయాసంగా గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కెప్టెన్ భువిని బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారు. హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోసిన రాజస్థాన్ టీమ్ 20 ఓవర్లలో ఏకంగా 203 పరుగులు చేసింది (IPL 2023).

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ను ఆదిలోనో ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) దెబ్బతీశాడు. మొదటి ఓవర్లోనే అభిషేక్ శర్మను దెబ్బతీశాడు. తర్వాతి బంతికే రాహుల్ త్రిపాఠిని కూడా ఔట్ చేశాడు. అయితే రాహుల్ ఔట్‌లో క్రెడిట్ మాత్రం స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జాసన్ హోల్డర్‌కే (Jason Holder) ఇవ్వాలి. బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతిని స్లిప్‌లో ఉన్న హోల్డర్ ఎడమ వైపునకు డైవ్ చేసి అద్భుతంగా అందుకున్నాడు (Super Catch). ఆ క్యాచ్ విషయంలో రాహుల్ అనుమానం వ్యక్తం చేసి రివ్యూ కోరాడు. అయితే బ్యాట్‌ను తగిలిన బంతి నేరుగా హోల్డర్ చేతిలో పడినట్టు స్పష్టంగా కనబడింది.

IPL 2023: ఈ ఐపీఎల్ సీజన్‌తో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో.. వేలంలో రూ. 13 కోట్లు పలికి 13 రన్స్ కొట్టిన మహానుభావుడు ఎవరంటే..

బౌల్ట్ తర్వాత చాహల్‌ వరుస విరామాల్లో వికెట్లు తీసి రైజర్స్‌ను కుదురుకోనీయలేదు. ఓ దశలో రైజర్స్ జట్టు వంద పరుగులైనా చేస్తుందా? అన్న సందేహం కలిగింది. అయితే చివర్లో ఉమ్రాన్‌, సమద్‌ వరుస బౌండ్రీలతో ఫ్యాన్స్‌ను కాస్త ఖుషీ చేయగలిగారు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఈ జోడీదే అత్యధిక (తొమ్మిదో వికెట్‌కు 36 పరుగులు) భాగస్వామ్యం కావడం గమనార్హం.

Updated Date - 2023-04-03T13:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising