ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2023-02-22T20:23:25+05:30

విశాల్ నటిస్తున్న సినిమాల్లో ప్రమాదాలనేవి కామన్‌గా మారాయి. ‘లాఠీ’ (Laththi) సెట్‌లో కొన్ని రోజుల క్రితం విశాల్‌కు తీవ్ర గాయాలయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరిచిపోకముందే మరోసారి ఆయన భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాల్ నటిస్తున్న సినిమాల్లో ప్రమాదాలనేవి కామన్‌గా మారాయి. ‘లాఠీ’ (Laththi) సెట్‌లో కొన్ని రోజుల క్రితం విశాల్‌కు తీవ్ర గాయాలయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరిచిపోకముందే మరోసారి ఆయన భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు.

విశాల్ తాజాగా నటిస్తున్న సినిమా ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony). పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతుండటంతో అనేక స్టంట్స్ ఉన్నాయి. అందులో భాగంగా భారీ వాహనంతో ఓ సీన్‌ను షూట్ చేస్తున్నారు. ఆ వాహనం ఎదురుగా వస్తున్నప్పుడు హీరో తప్పించుకునే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కానీ, ఈ సీన్ షూటింగ్ సమయంలో విశాల్ కిందపడిపోయారు. భూమి మీద నుంచి లేవలేదు. ఆలస్యం అయితే విశాల్ మీద నుంచి ఆ వాహనం దూసుకుపోయేది. అటువంటి సమయంలోనే కొంత మంది హీరోను పక్కకు తప్పించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ దుర్ఘటన చెన్నై శివారు ప్రాంతాల్లో మంగళవారం జరినట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. సాంకేతిక లోపమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఈ చిత్రంలో రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ పాత్రను చేస్తోంది. ఎస్‌జే సూర్య (SJ. Surya) విలక్షణ పాత్రను పోషిస్తున్నారు. ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. జీవీ. ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - 2023-02-22T20:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising