ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Waltair Veerayya : సెటైర్లు వేసిన శృతిహాసన్

ABN, First Publish Date - 2023-01-13T11:16:51+05:30

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ (Shruti Haasan), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సరసన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)లో నటించిన విషయం తెలిసిందే.

Shruti Haasan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ (Shruti Haasan), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సరసన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)లో నటించిన విషయం తెలిసిందే. అలాగే ‘వీరసింహారెడ్డి’లోనూ హీరోయిన్‌గా నటించింది. అయితే ‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హాజరైన శృతి.. చిరంజీవి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మాత్రం రాలేదు. ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోయిందని చిరంజీవే వేదిక మీద తెలియజేశారు. అయితే మీడియాలో మాత్రం శృతికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే ఆ వేడుకకి రాలేకపోయిందని వార్తలు వచ్చాయి. వాటి మీద తాజాగా శృతీ హాసన్ స్పందించింది.

ట్విట్టర్‌‌లో శృతీ ఓ పోస్ట్‌ని షేర్ చేసింది. కొన్ని స్క్రీన్ షాట్‌లను షేర్ చేసింది. అందులో.. ‘సరే, ఇక్కడ విషయం ఉంది. ఇది తప్పుడు సమాచారం. అలాంటి విషయాలపై నాటకీయతకి కలిపి రాయడం వల్ల జనాలు భయాందోళనలకు లోనవుతారు. మాససిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి ఇంకా భయపడతారు. నా విషయంలో అలా భయపెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఇది వర్కౌట్ కాలేదు. నేను ఎల్లప్పుడు మాససిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తాను. నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్నా. మీరు చాలా బాగా ప్రయత్నించారు. కానీ మీకు సమస్య ఉన్నట్లు ఉంది. అందుకే థేరఫిస్ట్‌తో మాట్లాడాలి’ అని సెటైరికల్‌గా రాసుకొచ్చింది.

Updated Date - 2023-01-13T11:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising