ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR-Bhanumathi: ఒకే సినిమా.. రెండు అర్ధ శతదినోత్సవాలు

ABN, First Publish Date - 2023-02-12T12:18:36+05:30

రామకృష్ణా సినీ స్టూడియోస్‌ పతాకంపై తెరకెక్కిన తొలి చిత్రం ‘తాతమ్మ కల’ (30-08-1974) లోని స్టిల్‌ ఇది..

NTR
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామకృష్ణా సినీ స్టూడియోస్‌ (RamaKrishna Studios) పతాకంపై తెరకెక్కిన తొలి చిత్రం ‘తాతమ్మ కల’ (Tattama Kala) (30-08-1974) లోని స్టిల్‌ ఇది. ఈ చిత్రంలోనే పి.భానుమతి (P.Bhanumathi) మునిమనవడిగా నటించి నందమూరి బాలకృష్ణ చిత్రసీమలోకి ప్రవేశించారు. అప్పటికి కొంత నిర్మాణం జరిగి, మధ్యలో ఆగి పోయిన రామకృష్ణా సినీ స్టూడియో నిర్మాణం కోసమే.. ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయమంతా వినియోగించాలనే ఉద్దేశంతో తీశారు. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ పథకాన్ని నిరసిస్తూ నిర్మించిన చిత్రం కావడంతో నిషేధించాలనుకున్నారు.

అందువల్లే ఈ సినిమా (30-08-1974 / 08-01-1975) సెన్సారు అయి రెండుసార్లు విడుదలైంది. విడుదలైన రెండుసార్లు అర్ధ శతదినోత్సవం జరుపుకోవడం ఈ చిత్ర ప్రత్యేకత. ఎన్‌.టి.రామారావు (NTR) ముసలయ్య, రామయ్యగా ద్విపాత్రాభినయం చేశారు. ఎన్‌.టి.ఆర్‌. దర్శకత్వంలో భానుమతి నటించిన తొలిచిత్రమిది. ఉత్తమ కథా రచయితగా ఎన్‌.టి.ఆర్‌. నంది అవార్డు కూడా అందుకున్నారు.

Updated Date - 2023-02-12T12:18:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising