ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Actor Naresh: కొత్త ట్విస్ట్.. ఫోన్ హ్యాక్ చేసి, చంపడానికి ప్రయత్నించిందంటూ..

ABN, First Publish Date - 2023-01-27T12:18:16+05:30

టాలీవుడ్ సినీయర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేశ్‌ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే.

Naresh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ సినీయర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేశ్‌ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నిరోజులుగా వీరి గురించి టాలీవుడ్‌ ఇండస్ట్రీలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో నరేశ్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి గొడవ జరుగుతోంది. ఈ నటుడిపై ఆమె రకరకాల ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవలే నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియో ద్వారా తెలిపారు. తాజాగా నరేశ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చింది.

రమ్య రఘుపతి, రోహిత్ శెట్టి నుంచి తనకు ప్రాణహానీ ఉందని నరేశ్ తాజాగా కోర్ట్‌ను ఆశ్రయించాడు. 2010 మార్చి 3న బెంగుళూరులో రమ్యతో వివాహం జరగగా.. ఆ సమయంలో కట్నం కూడా తీసుకోలేదని తెలిపాడు. అప్పుడు మా అమ్మ విజయ్ నిర్మల రమ్యకు 30 లక్షల బంగారం చేయించిందని చెప్పాడు. అలాగే..‘పెళ్లి అయిన కొన్ని నెలల నుంచే నాపై వేధింపులు ప్రారంభించింది. తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతులు పెట్టింది. రమ్యకు నాకు 2012లో రణ్‌వీర్ జన్మించాడు. నాకు తెలియకుండానే పలు బ్యాంకులు, పలువురు వ్యక్తుల దగ్గర డబ్బు తీసుకుంది. నా పేరు చెప్పి లక్షల్లో అప్పులు చేసింది. అప్పు ఇచ్చినవారు ఇంటికి వచ్చి నన్ను వేధించేవారు. అప్పులు తీర్చేందుకు 10 లక్షలు చెల్లించాను కూడా. నా కుటుంబ సభ్యుల నుంచి మరో 50 లక్షలు తీసుకుంది.

నా ఆస్తిని కాజేయడానికి రమ్య ప్రయత్నించింది. ఒప్పుకోకపోవడంతో నన్ను చంపేందుకు ప్రయత్నించింది. దాని కోసం సుపరి గ్యాంగ్‌ను కూడా మాట్లాడింది. 2022 ఏప్రిల్‌లో కొంతమంది అగంతకులు నా ఇంట్లో చొరబడ్డారు. రూ.24 లక్షలు రికవరీ చేయడానికి వచ్చామని మాయ మాటలు చెప్పారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. తనకు నేను డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసింది. అలాగే.. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో ఫోన్ చేయించి బెదిరించింది. నన్ను చంపేస్తారని భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్లడం లేదు. తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకుంది. నా ఫోన్ ను హ్యాక్ చేసి పర్సనల్ మెసేజ్‌లు చూసేది. రమ్య వల్ల నరకయాతన అనుభవించాను. రమ్య వేధింపులు భరించలేకపోతున్నాను. నాకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించండి’ అని నరేశ్ పేర్కొన్నాడు.

Updated Date - 2023-01-27T12:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising