ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naga Chaitanya: ఇదొక ఫ్యాన్‌ మూమెంట్‌!

ABN, First Publish Date - 2023-02-26T18:09:24+05:30

ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారుండరు. ఆయన కట్టిన బాణీకి ఎవరైనా ఫిదా కావాల్సిందే! ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ఆయన సంగీతం వల్ల హిట్‌ అయిన చిత్రాలు ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇళయరాజా(Ilayaraja) సంగీతాన్ని ఇష్టపడని వారుండరు. ఆయన కట్టిన బాణీకి ఎవరైనా ఫిదా కావాల్సిందే! ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ఆయన సంగీతం వల్ల హిట్‌ అయిన చిత్రాలు ఉన్నాయి. టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్యకు (akkineni Nagachaitanya) ఇళయరాజా సంగీతం అంటే ఎంతో ఇష్టం. సినిమాలపై ఆసక్తి కలగడానికి ఇళయరాజా సంగీతం ఓ కారణమని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతం ఇళయరాజాను కలిసిన ఆనందంలో ఉన్నారు నాగచైతన్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కస్టడీ’ చిత్రానికి ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నా. తాజాగా హైదరాబాద్‌ లైవ్‌ కాన్సెర్ట్‌ కోసం వచ్చిన ఇళయరాజాను నాగచైతన్య కలిశారు. ఆ ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ‘కస్టడీ’ (custody) సినిమా మ్యూజిక్‌ కంపోజిషన్‌ గురించి ఓ పోస్ట్‌ చేశారు ‘‘ఈ రోజు మ్యాస్ర్టో ఇళయరాజా (maestro ilayaraja) సార్‌ను కలిసిన వెంటనే నా ముఖం చిరునవ్వుతో నిండిపోయింది. ఇదొక ఫ్యాన్‌ మూమెంట్‌. నా జీవితంలో చాలా సందర్భాల్లో ఆయన సంగీతాన్ని వింటూ సీన్స్‌ను ఊహించుకుంటూ ఉండేవాడిని. అంతగా ఆయన సంగీతం నా జీవితంలో ఎన్నో ప్రయాణాల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆయన మా ‘కస్టడీ’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చారు. ‘కస్టడీ’ చిత్రంలో నాగచైతన్య పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కృతిశెట్టి మరోసారి జంటగా నటించనుంది. మే 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. (Naga chaitanya fan moments)

Updated Date - 2023-02-26T18:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising