ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tech layoffs: ఉద్యోగాలు కోల్పోయిన టెక్ నిపుణులు తాము పనిచేసిన కంపెనీలపై అలా ‘ప్రతీకారం’ తీర్చుకుంటున్నారట!

ABN, First Publish Date - 2023-03-07T09:59:59+05:30

Tech layoffs: గత మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టెక్ నిపుణులకు పలు కంపెనీలు ఉద్వాసన(layoffs) పలికాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Tech layoffs: గత మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టెక్ నిపుణులకు పలు కంపెనీలు ఉద్వాసన(layoffs) పలికాయి. కొందరు దశాబ్దానికి పైగా పనిచేసిన కంపెనీల నుంచి తొలగింపునకు గురయ్యారు. మరికొందరు పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ వారిపై తొలగింపు వేటు పడింది. దీనికితోడు ఇప్పుడు నూతన నియామకాలు(New appointments) నిలిచిపోవడంతో వారికి ఉద్యోగాలు దొరకడం కష్టతరంగా మారింది.

దీంతో అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోయినవారిలో 63 శాతానికిపైగా నిరుద్యోగులు(unemployed) తమ సొంత వెంచర్‌లు ప్రారంభించే దిశగా ముందుకు సాగుతున్నారు. స్వయం సమృద్ధి సాధించాలని నిర్ణయించుకుంటున్నారు. ఫైనాన్షియర్ క్లారిఫై క్యాపిటల్ (Financier Clarify Capital) నిర్వహించిన సర్వే ప్రకారం ఇటీవల వివిధ సంస్థలు తొలగించిన టెక్కీలలో 63 శాతం మంది ఇప్పటికే తమ సొంత వ్యాపారాలను ప్రారంభించారు. ఇప్పుడు వారంతా తమను తొలగించిన కంపెనీలకు గట్టిపోటీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు.

తొలగింపునకు(layoffs) గురైన ప్రతీ నలుగురిలో ఒకరు ఉద్యోగం కోసం అవస్థలు పడటాన్ని చూసిన మిగిలినవారు సొంత కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకుంటున్నారు. కొత్తగా సొంత వ్యాపారాన్ని ప్రారంభించిన టెక్ నిపుణులు తమ సగటున వార్షిక ఆదాయం(Annual income)లో $13,000 పెరుగుదలను నమోదు చేశారు. వీరంతా ప్రైవేటురంగ ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైనా.. ఇప్పుడు తమ సొంత సంస్థలో సురక్షితం(safe)గా ఉన్నామని గర్వంగా చెబుతున్నారు. కొంతకాలంగా టెక్ తొలగింపులు కొనసాగుతున్నందున, ఉద్యోగాలు కోల్పోయినవారంతా ఆరు నెలల లోపే సొంత వెంచర్‌(Own venture)లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

యుఎస్‌లో హెచ్‌ వన్ బి వీసా(H 1 B Visa)లపై పనిచేస్తున్న భారతీయులకు 60 రోజుల్లో మరో ఉద్యోగం దొరకని పక్షంలో తిరిగి భారత్(India) వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వారంతా సొంత వ్యాపారాలను(own businesses) ప్రారంభించడమే ఉత్తమమని భావించి, ఆ దిశగా ముందుకు సాగుతున్నారు.

Updated Date - 2023-03-07T10:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising