ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avatar 2: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా రికార్డు

ABN, First Publish Date - 2023-01-21T20:08:50+05:30

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar2). ఈ మూవీ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 160భాషల్లో విడుదల అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar2). ఈ మూవీ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 160భాషల్లో విడుదల అయింది. ఈ సినిమాను మేకర్స్ అందుబాటులో ఉన్న అన్ని ఫార్మాట్స్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ‘అవతార్ 2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

‘అవతార్ 2’ ఇప్పటి వరకు ఇండియాలో రూ.368.2కోట్ల నెట్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. భారత్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హాలీవుడ్ మూవీగా రికార్డును సృష్టించింది. గతంలో ఈ రికార్డు ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ (Avengers End game) పేరిట ఉండేది. ఈ చిత్రం మన దేశంలో రూ.367కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ‘అవెంజర్స్’ నెలకొల్పిన రికార్డును ఏ హాలీవుడ్ చిత్రం కూడా చెరిపేయలేకపోయింది. తాజాగా ‘అవతార్ 2’ మాత్రం రూ.368కోట్ల కలెక్షన్స్‌తో ఆ రికార్డును తిరగరాసింది. కానీ, తొలిరోజు కలెక్షన్స్ రికార్డు మాత్రం ఇప్పటికీ ‘అవెంజర్స్’ పేరిటే ఉంది. ఈ చిత్రం 2019లో రూ.53.1కోట్ల వసూళ్లను సాధించింది. ‘అవతార్ 2’ తొలిరోజు రూ.41కోట్ల నెట్ కలెక్షన్స్‌ను మాత్రమే కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్‌గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ 2022లో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన చిత్రంగా ఇప్పటికే రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అతి త్వరలోనే 2బిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరే అవకాశముంది.

Updated Date - 2023-01-21T20:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising