ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AllariNaresh: రూటు మార్చాడు, ఉగ్రంతో వస్తున్నాడు

ABN, First Publish Date - 2023-02-22T16:52:58+05:30

నరేష్ నటుడిగా కొత్తగా ఏమీ అందరికీ ప్రూవ్ చెయ్యాల్సిన పని లేదు. అతను కెరీర్ మొదట్లోనే 'నేను' (Nenu) అనే ఒక సినిమా, అలాగే 'గమ్యం' (#Gamyam) సినిమాలో గాలి శీనుగా (#GaaliSeenu) ఇలా చాలా మంచి పాత్రలు చేసి తాను మంచి నటుడని ఎప్పుడో చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు 'ఉగ్రం' (Ugram) తో వస్తున్నాడు. టీజర్ విడుదల అదయింది, అది ఎలా ఉందంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లరి నరేష్ (#AllariNaresh) అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది అతను కామెడీ యాక్టర్ అనే. కానీ నరేష్ ఈమధ్య తన రూటు మార్చాడు. మంచి కథలు వస్తే చెయ్యాలని డిసైడ్ అయినట్టు వున్నాడు, అందుకే అది కామెడీ సినేమానా, లేక సీరియస్ సినేమానా అని చూడకుండా, కథకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలే చెయ్యాలని అనుకున్నట్టుగా కనపడుతోంది. అందులో భాగంగానే వస్తున్న 'ఉగ్రం' (#Ugram) సినిమా అని అనుకోవాల్సి వస్తోంది. నరేష్ నటుడిగా కొత్తగా ఏమీ అందరికీ ప్రూవ్ చెయ్యాల్సిన పని లేదు. అతను కెరీర్ మొదట్లోనే 'నేను' (Nenu) అనే ఒక సినిమా, అలాగే 'గమ్యం' (#Gamyam) సినిమాలో గాలి శీనుగా (#GaaliSeenu) ఇలా చాలా మంచి పాత్రలు చేసి తాను మంచి నటుడని ఎప్పుడో చెప్పకనే చెప్పాడు.

అయితే ఎటువంటి నటుడికి అయినా అప్పుడప్పుడూ ఒక మంచి బ్రేక్ అంటూ పడాలి కదా. అదే ఇప్పుడు నరేష్ కి కావలసింది. అది 'ఉగ్రం' రూపంలో వస్తుంది అని అనుకుంటున్నాడు. దీనికి విజయ్ కనకమేడల (#VijayKanakamedala) దర్శకుడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు అంటే 2021లో ‘నాంది’ (#Nandi) అనే చిత్రం వచ్చింది. అందులో కూడా నరేష్ చాలా బాగా నటించాడు, ఆ సినిమా ఆలోచించ తగ్గ చిత్రంగా ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే ఈ సినిమా నరేష్ రూట్ మార్చే దిశగా చేసింది. ఎప్పుడూ కామెడీ సినిమాలు చేసే నరేష్ కొంచెం యాక్షన్, థ్రిల్లర్, చిన్న సామజిక సందేశం వున్న సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రాబోయే 'ఉగ్రం' ఒక యాక్షన్ సినిమా లా కనపడుతోంది ట్రైలర్ చూస్తే, అలాగే ఇందులో నరేష్ ఒక పోలీస్ పాత్ర వేసాడు. అదీ కాకుండా నంది సినిమాకి దర్శకత్వం చేసిన విజయ్‌ కనకమేడల ఈ ‘ఉగ్రం’ (Ugram) సినిమాకి కూడా దర్శకుడు కావటం ఆసక్తికరం.

హైదరాబాద్‌లోని ఏఎంబీ మల్టీప్లెక్స్ లో అక్కినేని నాగ చైతన్య (#NagaChaitanya) ‘ఉగ్రం’ టీజర్‌ను విడుదల చేశారు. అల్లరి నరేష్ కాస్త నరేష్ గా మారాడు. విడుదల అయినా ఈ టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. 'ఉగ్రం' అనగానే, కథానాయకుడు ఎందుకు అంత ఉగ్రంగా తయారయ్యాడు అన్న దాని మీద కథ నడిచినట్టుగా కనపడుతోంది. కథానాయకుడి కుటుంబ సభ్యులు, తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులను వెంటాడి, వేటాడే పోలీస్ ఆఫీసర్‌గా నరేష్ కొంచెం వైవిధ్యంగా ఇందులో కనిపించాడు. దానికితోడు శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతం ఇంకా ఆసక్తి తెప్పించింది.

Updated Date - 2023-02-22T16:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising