ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train Journy: 34 ఏళ్ల ఈ యువతి.. రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులంతా చూస్తుండగానే ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయిందంటే..!

ABN, First Publish Date - 2023-06-26T14:11:48+05:30

నీటిలోకి జారిపోకుండా ఉండేందుకు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడంతో ..

woman died
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక నిర్లష్యం ఖరీదు నిండు ప్రాణం. మరణం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేం. ఇప్పటి పరిస్థితుల్లో మరణం ఎటునుంచైనా రావచ్చు. ఈ రోజుల్లో చావుకు చిన్నా పెద్దా బేధం లేకుండా పోతుంది. చిన్న చిన్న తప్పులతో ప్రాణాలను కోల్పోతున్నవారు చాలామందే ఉన్నారు. ఇక వర్షాకలమైతే ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో బుుతుపవనాల రాకతో ఎండలు పోయి వానలు పడుతున్నాయి. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు గాలికి కరెంట్ తీగలు తెగిపోవడం కూడా జతై, ప్రాణాల మీదకు వస్తుంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 34 ఏళ్ల మహిళ నీటి ప్రవాహం మధ్య విద్యుదాఘాతానికి గురై మరణించింది.

తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌కు చెందిన సాక్షి అహుజా ఉదయం 5:30 గంటలకు ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలతో కలిసి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. వర్షం కారణంగా తడిచిన విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని ఆమె మృతి చెందిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పరిస్థితిని గమనించి ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ఆమెను ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతి చెందింది.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఎగ్జిట్ నంబర్ వన్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. లక్ష్మీ నగర్‌లోని ప్రియదర్శని విహార్‌లోని లవ్లీ పబ్లిక్ స్కూల్‌లో అహుజా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సాక్షి అహుజా పార్ట్ టైమ్ ఆర్కిటెక్ట్ కూడా. ఆమె తన కుటుంబంతో చండీగఢ్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టుకోవడానికి ఉదయం 5.30 గంటలకు స్టేషన్‌కు వచ్చింది. నీటిలోకి జారిపోకుండా ఉండేందుకు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ ఘాతంతో చనిపోయిన సాక్షిని అహుజాను ఆమె సోదరి మాధవి చోప్రా ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. కాకపోతే అప్పటికే సాక్షి మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: కన్నతండ్రి కదా.. కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.. కూతురికి సర్‌ప్రైజ్ ఇద్దామని చెప్పాపెట్టకుండా కెనడాకు వెళ్లి..

వర్షాకాలం నీటి కుంటలు నిండి ఉండటం, విద్యుత్ తీగలు తెగిపడిన చోట సరైన జాగ్రత్తలు తీసుకోకపోడం వల్లనే ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాలకు, ప్రాణాలు పోయేందుకు కారణం అవుతుంది. ఇంత ప్రమాదానికి అధికారుల నిర్లక్షమే కారణమి ఆరోపిస్తూ బాధితురాలి సోదరి మాధవి చోప్రా, సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. సాక్షి తండ్రి లోకేష్ కుమార్ చోప్రా కూడా అధికారుల నిర్లష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. తెగిపడిన విద్యుత్ తీగలను చూపిస్తూ తన బాధను పంచుకున్నారు. ఈ ఘటనపై రైల్వే, పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సాక్షి అహుజా మరణం తర్వాత బాంబే సబ్ అర్బన్ ఎలక్ట్రిక్ సప్లై (BSES) ఒక ప్రకటన జారీ చేసింది.

1. ఎవరైనా పడిపోయిన కేబుల్, స్తంభం లేదా బహిర్గతమైన వైర్‌ను చూసినట్లయితే, 19123 దక్షిణ, పశ్చిమ ఢిల్లీ 19122 కి కాల్ చేసి సంబంధిత అధికారులకు తెలియజేయవచ్చు.

2. కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాల దగ్గర, బారికేడ్‌లు వేసినా, నీరు నిలిచే పార్కుల్లో ఆడకుండా పిల్లలను హెచ్చరించాలి.

3. మీటర్ క్యాబిన్‌లో నీరు నిలిచిపోయినా, లీకేజీ అయినప్పుడు, మెయిన్ స్విచ్‌ను స్విచ్ ఆఫ్ చేయమని సలహాగా పేర్కొంది. అన్ని లోపాలను సరిదిద్దినట్లు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మెయిన్ స్విచ్ ఆన్ చేయండి.

4. షాక్‌లు, ప్రమాదాలను నివారించడానికి, మద్దతు కోసం ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ (ELCB)ని ఇన్‌స్టాల్ చేయండి.

Updated Date - 2023-06-26T14:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising