ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: యూటాలోని స్కూల్ డిస్ట్రిక్టల్‌లో కింగ్ జేమ్స్ బైబిల్‌పై నిషేధం

ABN, First Publish Date - 2023-06-04T16:06:02+05:30

యూటా రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో స్కూళ్లు.. కింగ్ జేమ్స్ బైబిల్‌పై నిషేధం విధించాయి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కరిక్యులమ్ నుంచి తొలగించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: యూటా(Utah) రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో స్కూళ్లు.. కింగ్ జేమ్స్ బైబిల్‌పై(King james bible) నిషేధం విధించాయి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కరిక్యులమ్ నుంచి తొలగించాయి. సాల్ట్ లేక్ సిటీకి తూర్పున ఉన్న డేవిస్ స్కూల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని స్కూళ్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కింగ్ జేమ్స్ బైబిల్‌లో కొన్ని భాగాలు హింసాత్మకంగా, అభ్యంతరకంగా ఉన్నాయంటూ గతేడాది కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ నిషేధం విధించారు. 2022లో రూపొందించిన విద్యా చట్టం ప్రకారం, యూటా రాష్ట్రంలో అభ్యంతర పుస్తకాలను స్కూళ్ల నుంచి తొలగించవచ్చు.

అయితే, కింగ్ జేమ్స్ బైబిల్‌లోని విషయాల్ని పిల్లలకు తమ స్కూళ్లల్లో ఎప్పుడూ బోధించలేదని డేవిస్ స్కూల్ డిస్ట్రిక్ట్ అధికారులు తెలిపారు. ఈ బైబిల్‌కు సంబంధించి ఏడు, ఎనిమిది కాపీలను తీసేసినట్టు పేర్కొన్నారు. బైబిల్‌లోని ఏయే భాగాలు అభ్యంతరకరమో వారు వెల్లడించలేదు. అయితే, కొత్త చట్టం ఆధారంగా బైబిల్‌ను నిషేధించడం హాస్యాస్పదమని చట్టం రూపకర్తల్లో ఒకరు గతవారం వ్యాఖ్యానించారు. ఆ మరుసటి వారమే ఆయన తన రూటు మార్చుకున్నారు. విద్యార్థులకు ఈ బైబిల్ పఠనం ఓ సవాలేనని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-04T17:11:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising