ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోకాళ్ల నొప్పులకు కార్టిలేజ్‌ (గుజ్జు) అరిగిపోవటమే ముఖ్య కారణం

ABN, First Publish Date - 2023-02-13T22:08:01+05:30

మోకాళ్ల నొప్పితో బాధపడేవాళ్లు ఏ వయస్సువారైనా ఈ చికిత్స తీసుకోవచ్చు. మోకాళ్ల నొప్పి 45 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోకాళ్ల నొప్పితో బాధపడేవాళ్లు ఏ వయస్సువారైనా ఈ చికిత్స తీసుకోవచ్చు. మోకాళ్ల నొప్పి 45 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద వయస్సు వారిలో ఇది అధికంగా కనిపిస్తుంది. యువకుల్లో అయితే క్రీడలు ఆడేటప్పుడు .. ఇతర గాయాలైనప్పుడు కూడా మోకాళ్ల నొప్పి సమస్య రావచ్చు. అధిక బరువు, స్థూలకాయం సమస్య ఉన్న వారిలో కూడా మోకాళ్ల నొప్పి ఎక్కువగా ఉంటుంది.

ప్లాస్మా చికిత్స ఎలా పనిచేస్తుంది?

రక్తంలో ఉండే ప్లేట్లెట్‌ కణాలు చాలా చిన్నవి. రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మోకాలి కీలులో కార్టిలేజ్‌ దెబ్బతిన్నప్పుడు సాధారణంగా మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఇలా దెబ్బతిన్న భాగంలోకి ప్లేట్లెట్‌ ఎక్కువగా ఉండే ప్లాస్మాను ఇంజెక్ట్‌ చేస్తారు. దీనితో కొత్త కణజాలాన్ని ఉత్పత్తి చేయగల కారకాలు ప్రేరేపించబడతాయి. ఫలితంగా మొత్తం కణజాలం పునరుత్పత్తి చెందుతుంది. .

లాభాలివి...

ఈ చికిత్స కేవలం 30 నిమిషాల్లో పూర్తవుతుంది. మోకాళ్ల మార్పిడి చికిత్స మాదిరిగా ఇది ఆపరేషన్‌ కాదు. చిన్న ఇంజిక్షన్‌ ద్వారా చేయబడుతుంది. అందువల్ల నెప్పి ఉండదు. రక్తస్రావం ఉండదు. ఈ చికిత్స పొందిన వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చికిత్స అయిన వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు. దీని వల్ల ఇన్‌ఫెక్షన్ల బాధ ఉండదు. ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. చికిత్స ప్రారంభం నుంచే నొప్పి తగ్గుముఖం పట్టి ఎప్పటిలాగ పనులు చేసుకోవచ్చు.

మోకాలి చికిత్స కోసం అందుబాటులో ఉన్న చికిత్సల్లో ప్లేట్ల్‌ట్‌ రిచ్‌ ప్లాస్మా విధానం కన్నా సమర్థవంతమైనది మరొకటి ఉందని ఇప్పటి దాకా నిరూపించలేకపోయారు. దీనికి బెడ్‌ రెస్ట్‌ కూడా అవసరం లేదు. మోకాలి, కీళ్ల సమస్యలను తగ్గించటానికి ఇది సహజమైన, సౌకర్యవంతమైన మార్గం. ఈ ఆధునిక చికిత్సా విధానం అందుబాటులోకి తెచ్చిన ఎపియోన్‌ పెయిన్‌ మేనేజిమెంట్‌ సెంటర్లో మోకాళ్లు, భుజాల నొప్పులకే కాకుండా- నడుంనొప్పి, మైగ్రేన్‌, స్పాండిలైటిస్‌, సయాటికాలాంటి దీర్ఘకాలిక నొప్పులకు ఆపరేషన్‌ అవసరం లేకుండా ఆధునిక చికిత్సలు లభిస్తాయి.

Updated Date - 2023-02-13T22:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising