ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSS: క్రియాయోగకు రుగ్మతలను తొలగించే శక్తి - స్వామి చిదానందగిరి

ABN, First Publish Date - 2023-02-26T22:45:37+05:30

ఒడిదొడుకుల జీవన గమనంలో తీవ్రమవుతున్న ఆందోళన, ఆత్రుత, అసహనం వంటి రుగ్మతలను తొలగించే శక్తి క్రియాయోగకు ఉందని...

Swami Chidananda Giri
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పడంలో క్రియాయోగ (Kriya Yoga) సాధన అద్భుత పాత్ర వహిస్తుందని, ఒడిదొడుకుల జీవన గమనంలో తీవ్రమవుతున్న ఆందోళన, ఆత్రుత, అసహనం వంటి రుగ్మతలను తొలగించే శక్తి క్రియాయోగకు ఉందని యోగదా సత్సంగ సొసైటీ (Yogoda Satsanga Society - YSS) / సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (Self Realization Fellowship - SRF) అంతర్జాతీయ అధ్యక్షులు స్వామి చిదానందగిరి (Swami Chidananda Giri) తెలిపారు. ప్రేమ, శాంతి, సహనం, సుహృద్భావం, అవగాహన వంటి సాత్విక గుణాలను వృధ్ధి చేయడంలో క్రియాయోగ పాత్ర విశిష్టమైందని వివరించారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వైఎస్ఎస్ (YSS) యోగదా సత్సంగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వామి చిదానందగిరి పాల్గొన్నారు. దేశం నలుమూల నుంచి వచ్చిన సొసైటీ సభ్యులు, ఆధ్యాత్మిక గురువులు, భక్తుల సమక్షంలో చేసిన ప్రత్యేకంగా ఉపన్యాసమిస్తూ క్రియాయోగ ప్రాధాన్యతను తెలియజేశారు.

క్రియాయోగ సాధన ద్వారా అంతరంగ శుధ్ధి, ఆధ్యాత్మిక వృధ్ధి, లక్ష్య సిధ్ధి సులువుగా సాధ్యపడతాయని, అదే విధంగా, శరీరం, మెదడు, మనస్సులను అనుసంధానించే ఈ క్రియాయోగ ద్వారా అనేక సంక్లిష్టతలు, ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కోవడం సులభ సాధ్యమని స్వామి చిదానందగిరి తెలియజేశారు. కనుబొమ్మల మధ్య దృష్టి కేంద్రీకరించి, శ్వాస మీద ధ్యాసను నిలుపుతూ, దైవత్వంతో తన్మయత్వాన్ని ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రక్రియతో మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. సానుకూల ఆలోచనా ధోరణిని, భవిష్యత్‌పై భరోసాను కల్పించే క్రియాయోగతో పాటుగా ధ్యానం, గురువుల బోధనలున్న పుస్తకాల పఠనాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2023-02-26T23:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising