ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cyclones : ఇండియాకు పొంచివున్న తుఫాన్ల ముప్పు..!!

ABN, First Publish Date - 2023-10-22T15:36:50+05:30

భారత్ కు ఒకే సారి రెండు తుపాన్ల(Cyclone) నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. అరేబియా(Arabia) మహా సముద్రంలో తేజ్ తుపాను, బంగాళాఖాతం(Bay of Bengal)లో హమూన్ తుపాను రెండూ ఇండియా భూభాగంపైకి దూసుకువస్తున్నాయని స్పష్టం చేశారు.

ఢిల్లీ: భారత్ కు ఒకే సారి రెండు తుపాన్ల(Cyclone) నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. అరేబియా(Arabia) మహా సముద్రంలో తేజ్ తుపాను, బంగాళాఖాతం(Bay of Bengal)లో హమూన్ తుపాను రెండూ ఇండియా భూభాగంపైకి దూసుకువస్తున్నాయని స్పష్టం చేశారు. తేజ్ తుపాన్ ఆదివారం తీవ్ర తుఫానుగా మారి యెమెన్-ఒమన్ తీరాల వైపు పయనిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ తుపాన్ వాయువ్య దిశగా కదిలి, అల్ గైదా (యెమెన్), సలాలా (ఒమెన్) మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు.


తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 140 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. తీర రేఖకు ఇరువైపులా ఒకేసారి రెండు తుఫానులు సంభవించడం చాలా అరుదని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. చివరిసారిగా 2018లో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. హమూన్ తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా కదులుతోంది. తొలుత నైరుతి దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం సంభవించినట్లు ఐఎండీ నివేదించింది. అక్టోబరు 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీనికే హమూన్ అని పేరు పెట్టారు. మరి కొన్ని గంటల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. ఈ రెండు తుపానులు వాతావరణంపై పెను ప్రభావం చూపవని, తమిళనాడు, చెన్నై తీరాలలో తుపాను తీరం దాటిన వెంటనే వాతావరణం మారుతుందని వివరించారు. ఈ తుపాను ప్రభావంతో కేరళ, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రెండు సైక్లోన్ల ప్రభావంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - 2023-10-22T16:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising