ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raisins: ఎండు ద్రాక్షలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

ABN, First Publish Date - 2023-01-10T13:06:38+05:30

నల్ల ఎండుద్రాక్షలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేంటంటే...

బాల నెరుపు తగ్గాలంటే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్ల ఎండుద్రాక్షలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేంటంటే...

ముడతలు పడని చర్మం:

నల్ల ఎండుద్రాక్షలో సహజసిద్ధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తాయి. అలాగే మన శరీరంలోని హానికారక ఫ్రీర్యాడికల్స్‌ను వదిలించి, శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. దాంతో చర్మం ముడతలు పడే వేగం తగ్గుతుంది.

వెంట్రుకలు దృఢం:

మన రక్తప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉన్నంత కాలం వెంట్రుకలు రాలకుండా ఉంటాయి. అందుకోసం సరిపడా ఐరన్‌ అవసరం. ఎండుద్రాక్షలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది.

వెంట్రుకలు తెల్లబడడం:

బాల నెరుపు తగ్గాలంటే నల్ల ఎండుద్రాక్ష తినాలి. వీటిలో ఐరన్‌తో పాటు పెద్ద మొత్తంలో విటమిన్‌ సి ఉంటుంది. ఈ విటమిన్‌ ఐరన్‌ సంపూర్తి శోషణకు తోడ్పడుతుంది. దాంతో వెంట్రుకలు సహజ నలుపు రంగును కోల్పోకుండా ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్‌:

శరీరంలోని లో డెన్సిటీ లైపోప్రొటీన్‌/చెడు కొలెస్ట్రాల్‌ చెడు ప్రభావం నుంచి నల్ల ఎండుద్రాక్ష శరీరానికి రక్షణ కల్పిస్తుంది. వీటిలో కొలెస్ట్రాల్‌కు వ్యతిరేకంగా పని చేసే సాల్యుబుల్‌ ఫైబర్‌ ఉంటుంది. రక్తప్రవాహం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను కాలేయానికి చేర్చి, శరీరం నుంచి విసర్జించేలా చేసేందుకు ఫైబర్‌ తోడ్పడుతుంది.

Updated Date - 2023-01-10T13:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising