ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబా సాహెబ్ లేచే ఉన్నాడు

ABN, First Publish Date - 2023-04-07T01:04:56+05:30

అతను నూట ఇరవయ్యైదడుగుల విగ్రహాల్లో లేడు నాలుగెకరాల్లోనో పదిహేనెకరాల్లోనో లేడు స్మారక మందిరాల్లో లేడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అతను

నూట ఇరవయ్యైదడుగుల విగ్రహాల్లో లేడు

నాలుగెకరాల్లోనో

పదిహేనెకరాల్లోనో లేడు

స్మారక మందిరాల్లో లేడు

ప్రభుత్వాల బండరాళ్ళల్లో లేడు

ఐనా,

అంటరాని ఆకాశాన్ని

మోసపు అడుగులతో కొలవలేరు!

ఆకలి పల్లెల్లో

అవమానాల గుండెల్లో

రగిలిపోయే గూడేల్లో

పునర్భవమై

మట్టి, వెట్టి, బేగరి

కూలి, మాలి,

హమాలి, తోటమాలి

మాతంగి, జోగి, పాకి

బాలకార్మికి, చర్మకారి

నిరక్షరీలలో

స్వయంగౌరవ జెండాయై

రెప రెప కదుల్తున్నాడు

రప రప మెదుల్తున్నాడు

కాకదేల్తున్నాడు

కాస్తున్నాడు

లేస్తున్నాడు

కూడదీసుకున్న ధైర్యమై

ముందుకు పడే అడుగులై

బిగిసిన పిడికిళ్లై

నినాదాల గర్జనలై

మట్టికాళ్ళ మహాయాత్రయై

తిరిగి లేస్తున్నాడు

కొత్త రాజ్యాంగం లిఖిస్తున్నాడు

మరో రిపబ్లిక్‌ని కలగంటున్నాడు

అతను

దర్బారు బాకాల్లో లేడు

సర్కారు కట్టడాల్లో లేడు

పడగొట్టిన విగ్రహాల్లో లేడు

పడి లేస్తున్న మనుషుల్లో చూడు

బాబా సాహెబ్ లేచే ఉన్నాడు

(అంబేడ్కర్ పొడుగు విగ్రహాలు, భవనాలు, పార్కులు, పథకాలు... ప్రభుత్వాల కథలు విని)

కృపాకర్ మాదిగ

Updated Date - 2023-04-07T01:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising