స్పైసీ సలాడ్‌

ABN , First Publish Date - 2022-05-06T17:08:11+05:30 IST

కీరా దోసకాయ- ఒకటి, వేరుశనగ పొడి- రెండు స్పూన్లు, మిరియాల పొడి- అర స్పూను, పచ్చి మిర్చి- ఒకటి, ఆవాల పొడి- 2 స్పూన్లు, ఎండు కొబ్బరి- స్పూను,

స్పైసీ సలాడ్‌

కావలసిన పదార్థాలు: కీరా దోసకాయ- ఒకటి, వేరుశనగ పొడి- రెండు స్పూన్లు, మిరియాల పొడి- అర స్పూను, పచ్చి మిర్చి- ఒకటి, ఆవాల పొడి- 2 స్పూన్లు, ఎండు కొబ్బరి- స్పూను, నిమ్మరసం- స్పూను, ఆలివ్‌ నూనె- స్పూను, నల్ల నువ్వులు- అర స్పూను.


తయారుచేసే విధానం: ముందుగా కీరా చెక్కుతీసి ముక్కలుగా కత్తిరించాలి. గిన్నెలో కీరా ముక్కలు, వేరుశనగ పొడి, మిరియాల పొడి, ఆవాల పొడి, పచ్చి మిర్చి ముక్కలు, ఎండు కొబ్బరి, ఆలివ్‌ నూనె, నిమ్మరసం వేసి అన్నింటినీ బాగా కలిపితే జపనీస్‌ స్పైసీ కుకుంబర్‌ సలాడ్‌ సిద్ధం.

Read more