మామిడికాయ పచ్చడి

ABN , First Publish Date - 2022-05-07T22:38:31+05:30 IST

మామిడికాయలు - రెండు, బెల్లం - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - రుచికి తగినంత

మామిడికాయ పచ్చడి

కావలసిన పదార్థాలు: మామిడికాయలు - రెండు, బెల్లం - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - ఒక టీస్పూన్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి - రెండు, ఆవాలు - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - మూడు. 


తయారుచేయు విధానం: మామిడికాయల పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత వాటిని కుక్కర్‌లో వేసి బెల్లం, పసుపు, పచ్చిమిర్చి, తగినన్ని నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఎండు మిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేయాలి. ఇప్పుడు బౌల్‌లో ఉన్న పచ్చడి వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కాసేపు ఉడికించుకున్న తరువాత దింపుకొంటే పచ్చడి రెడీ. 


Read more